Electoral Bonds : ఆ ఉద్దేశంతోనే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ తీసుకొచ్చాం: నితిన్ గడ్కరీ మంచి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. విరాళాలు లేకుండా రాజకీయ పార్టీని నడిపించడం అసాధ్యమని పేర్కొన్నారు. ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ కూడా ముందుకెళ్లలేదని తెలిపారు. By B Aravind 23 Mar 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Nitin Gadkari : లోక్‌సభ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పోలింగ్(Poling) జరగనుంది. ఇప్పటికే అధికార, విపక్ష పార్టీలు ఎన్నికల ప్రచారంలోకి దిగాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టు(Supreme Court) కు సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) అంశం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. 2017లో కేంద్రం తీసుకొచ్చిన పథకంపై సుప్రీం కోర్టు కొరడా ఝళిపించడం, అలాగే దీన్ని రద్దు చేయడంతో విపక్షాలు మోదీ సర్కార్‌పై తీవ్రంగా విమర్శలు చేశాయి. అయితే ఈ అంశంపై తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. మంచి ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. విరాళాలు లేకుండా రాజకీయ పార్టీని నడిపించడం అసాధ్యమని అన్నారు. Also Read : సముద్ర జలాల్లో 110 మందిని రక్షించాం : భారత నావీ గుజరాత్(Gujarat) లోని గాంధీనగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న నితిన్ గడ్కరీ(Nitin Gadkari).. ఎన్నికల బాండ్లకు సంబంధించి మాట్లాడారు. ' అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఎలక్టోరల్ బాండ్ల పథకం గురించి జరిగిన చర్చల్లో నేను కూడా ఉన్నాను. ఆర్థిక వనరులు లేకుండా ఏ పార్టీ కూడా ముందుకు వెళ్లలేదు. కొన్ని దేశాల్లో రాజకీయ పార్టీలకు ప్రభుత్వమే నిధులు అందజేస్తుంది. మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదు కాబట్టే.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. పార్టీలు నిధులు పొందాలనేదే ఈ పథకం ఉద్దేశం. అధికారంలో ఉన్న పార్టీ మారిపోతే సమస్యలు తెలెత్తుతాయన్న కారణంతనే విరాళాలు ఇచ్చిన దాతల పేర్లు బయటపెట్టలేదని గడ్కరీ వెల్లడించారు. ఈ పథకంలో ఏవైన లోపాలు ఉంటే.. సరిదిద్దుకోవాలని సుప్రీంకోర్టు పార్టీలను కోరాల్సింది. ఇలాంటి ఆదేశాలు వస్తే్.. పార్టీలన్నీ కలిసి దీనిపై చర్చించాలని నితిన్ గడ్కరీ అన్నారు. ఇదిలాఉండగా.. ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను రద్దు చేస్తూ.. సుప్రీంకోర్టు ఫిబ్రవరిలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుప్రీం ఆదేశాల మేరకు.. కేంద్రం బాండ్ల వివరాలు ఎన్నికల సంఘానికి, ఎస్‌బీఐకి సమర్పించగా.. ఎస్‌బీఐ దాన్ని సుప్రీంకోర్టుకు అందించింది. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం వాటి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. Also Read : సద్గురుపై పాము దాడి.. ఒకేసారి మూడు కాట్లు! #nitin-gadkari #telugu-news #electoral-bonds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి