/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/arv-jpg.webp)
ED Serious : ఈడీ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal).. ఢిల్లీ(Delhi) లోని తాగునీటి సరఫరా, మురుగునీటికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీచేశారని మంత్రి అతిశీ మార్లీనా(Atishi Marlena) ఆదివారం మీడియా సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ కాగితాన్ని కూడా చూపించారు. అయితే ఈ వ్యవహారంపై ఈడీ సీరియస్ అయ్యింది. విచారణ సమయంలో.. తాము కేజ్రీవాల్‌కు కంప్యూటర్ లేదా కాగితాలను ఇవ్వలేదని తెలిపింది. అసలు ఈ ఆదేశాలు ఎలా బయటికి వెళ్లాయో తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థ చర్యలు చేపట్టింది. దీంతో మీడియా సమావేశంలో చూపించిన ఆ కాగితం మంత్రి అతిశీకి ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు ఆమెను ఈడీ ప్రశ్నించే ఛాన్స్ ఉంది.
Also Read : నీరు వృధా చేసిన 22 ఫ్యామిలీలకు రూ. 5 వేలు ఫైన్!
అలాగే జైల్లో అరవింద్ కేజ్రీవాల్ కదలికలను గమనించేందుకు సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలించవచ్చని అధికారులు చెబుతున్నారు. మరోవైపు కేజ్రీవాల్‌ను చూసి ప్రధాని మోదీ(PM Modi) భయపడుతున్నారంటూ శివసేన ఉద్ధవ్ వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శలు చేశారు. రామ్‌లీలా మైదానంలో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించనున్న భారీ ర్యాలీకి తాము హాజరవుతామని పేర్కొన్నారు. జైలు నుంచే కేజ్రీవాల్ పాలన సాగిస్తుండటంతో బీజేపీకి కేజ్రీవాల్ మరింత ప్రమాదకరంగా మారారని తెలిపారు. ప్రజలు.. కేజ్రీవాల్ చెప్పేది వినడమే కాదు.. ఆయనకు మద్దతుగా కూడా తరలివస్తారని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో జైలుకు వెళ్లిన నాయకులు బలంగా తిరిగి వచ్చినట్లు గుర్తుచేశారు.
ఇదిలా ఉండగా మార్చి 31న మెగా ర్యాలీ నిర్వహించేలా ఇండియా కూటమి పిలుపునిచ్చింది. అలాగే రామ్‌లీలా మైదానంలో 1.5 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ రెడీ అవుతోంది. దీనికి సంబంధించి పార్టీ కార్యదర్శి సందీప్ పాఠక్.. నాయకులకు మార్గదర్శకాలు జారీ చేశారు. మార్చి 27, 28వ తేదీల్లో ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లతో కలిపి జోనల్ సమావేశాలు నిర్వహించాలన్నారు. అలాగే మార్చి 31వ తేదీన ప్రతి బూత్ నుంచి కూడా 10 మంది రామ్‌లీలా మైదానానికి వచ్చేలా చూడాలని సూచనలు చేశారు.
Also Read : ఎన్నికల వేళ POKపై రాజ్‌నాథ్ షాకింగ్ కామెంట్స్.. దాయాది దేశానికి మొదలైన దడ!