chandrayan-3:ఇప్పటివరకూ ఎలాంటి సందేశాలు లేవు-ఇస్రో

చంద్రుని మీద ఉన్న మన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు గత కొన్ని రోజులుగా నిద్రాణ స్థితిలో ఉన్నాయి. లెక్క ప్రకారం అయితే ఈ రోజు నుంచి అవి మళ్ళీ తిరిగి పని చేయాలి కానీ ఇప్పటి వరకూ వాటి నుంచి ఎటువంటి సందేశాలు అందలేదని ఇస్రో తెలిపింది.

New Update
chandrayan-3:ఇప్పటివరకూ ఎలాంటి సందేశాలు లేవు-ఇస్రో

చంద్రుని మీద పరిశోధనల ఇస్రో చేసిన ప్రయోగం చంద్రయాన్-3 సక్సెస్ అయింది. అయితే చంద్రుని మీద లూనార్ నైట్ ప్రారంభం అవడం వల్ల ఇస్రో విక్రమ్, ప్రజ్ఞాన్ లను ఈ నెల 2, 4 తేదీల్లో నిద్రాణ స్థితిలోకి పంపింది. ఈరోజుతో లూనార్ నైట్ ముగిసి మళ్ళీ చంద్రుని మీద పగలు మొదలవుతుంది. దీని ప్రకారం స్లీప్ మోడ్ లో ఉన్న విక్రమ్ , ప్రజ్ఞాన్ లు మళ్ళీ యాక్టివ్ అవ్వాలి. వీటిని క్రియాశీలకంగా మార్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాటి నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ మాత్రం ఇప్పటివరకూ రాలేదు. అయితే ఈ ప్రయత్నాలను ఇప్పటితో వదిలేయడం లేదని మరిన్ని జరుగుతాయని చెబుతోంది ఇస్రో.

చంద్రుని మీద విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు 14 రోజులు మాత్రమే పని చేస్తాయి. మన 14 రోజులు జాబిల్లి మీద ఒక పగలుతో సమానం. అక్కడ పగలు అవ్వగానే విక్రమ్, ప్రజ్ఞాన్ లను నిద్రాణ స్థితిలోకి పంపించేశారు మన శాస్త్రవేత్తలు. ఎందుకంటే చందమామ మీద రాత్రివేళ ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. ఉష్ణోగ్రతలు మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాంటి వాతావరణానికి ఎలక్ట్రానిక్ పరికరాలు తట్టుకోగలగడం, రీఛార్జ్ కావడం చాలా కష్టం. అందుకే వాటిని స్లీప్ మోడ్ లోకి పంపించేస్తారు. అయితే చంద్రుని మీద మళ్ళీ సూర్యోదయం అయ్యాక వాటిని తిరిగి నిద్రలేపుతారు. ప్రస్తుతం చంద్రుని మీద పగలు నడుస్తోంది. అందుకే ఇస్రో శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లతో కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు