Nithish Kumar: మోడీతో వేదిక పంచుకోనున్న నితీశ్‌ కుమార్‌!

కాంగ్రెస్‌ తో సన్నిహితంగా ఉంటూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రణాళికలు చేసిన నితీశ్‌ ఇప్పుడు మళ్లీ బీజేపీలో కలిసేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4న బెట్టియాలో జరిగే సమావేశంలో మోడీతో కలిసి ఒకే వేదికను పంచుకోనున్నారు.

Nithish Kumar: మోడీతో వేదిక పంచుకోనున్న నితీశ్‌ కుమార్‌!
New Update

Nitish Kumar: నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) వేదిక పంచుకోనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4న బీహార్‌లోని బెట్టియాలో జరగనున్న ర్యాలీలో మోడీతో కలిసి పాల్గొననున్నట్టు సమాచారం. ఆ సమయంలో అన్ని జె.డి.యు. జేడీయూ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బెట్టియా వద్దకు చేరుకోవాలని కార్యకర్తలకు ఆదేశాలు అందాయి.

ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ...

గత కొంత కాలం నుంచి ఇండియా కూటమికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. మొన్న కేజ్రీవాల్‌, నిన్న మమతా బెనర్జీ, ఈరోజు నితీశ్‌ కుమార్‌...వరుసగా ఒక్కొక్కరుగా ఇండియా కూటమి నుంచి బయటకు వస్తున్నారు. ఇదిలా ఉంటే ఏ కూటమిలో కూడా ఎక్కువ రోజులు ఉండని బీహార్‌ ముఖ్య మంత్రి , జేడీయూ నేత నితీశ్‌ కుమార్‌..మరోసారి బీజేపీతో జత కట్టేందుకు సిద్దమయ్యారని తెలుస్తుంది.

కొంతకాలంగా కాంగ్రెస్‌ తో సన్నిహితంగా ఉంటూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రణాళికలు చేసిన నితీశ్‌ ఇప్పుడు మళ్లీ బీజేపీలో కలిసేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 4న బెట్టియాలో జరిగే సమావేశంలో మోడీతో కలిసి ఒకే వేదికను పంచుకోనున్నారు. అయితే జేడీయూకి ప్రస్తుతం రెండు దారులు ఉన్నాయి. అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించడం లేదా నితీశ్‌నే సీఎంగా కొనసాగించడం..కానీ నితీశ్‌ ను ముఖ్యమంత్రిగా ఉంచడం పై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బీజేపీ నేతలు మాత్రం ...

అయితే నితీశ్‌ బీజేపీ వైపు రావడం గురించి బీజేపీ నేతలు మాత్రం సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ పెద్దలు కలగజేసుకుని నితీశ్‌ను ఏమి అనొద్దని పేర్కొన్నట్లు తెలుస్తుంది. నితీశ్‌ ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ఇది ఐదోసారి. ఆయన 2013 నుంచి కూడా ఆర్జేడీ-కాంగ్రెస్‌ - లెఫ్ట్‌ పార్టీల కూటమితో కొనసాగిన నితీశ్‌ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పై విజయం సాధించారు.

కుటుంబ రాజకీయాల పై..

విజయం సాధించారు కానీ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే మళ్లీ తిరిగి వచ్చిన ఆయన ఎన్డీఏ లో చేరారు. ఈ విధంగానే ఆయన 2020 ఎన్నికల్లో కూడా విజయం సాధించి అధికారం చేపట్టారు. కానీ మళ్లీ షరా మాములే బీజేపీతో పడలేదు. 2022 లో ఎన్డీఏ నుంచి వచ్చి ఆర్జేడీ పంచన చేరారు. ఈ క్రమంలోనే నితీశ్‌ బీహార్‌ లో కుటుంబ రాజకీయాల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో లాలూ కుమార్తె సోషల్‌ మీడియా వేదికగా నితీశ్‌ కు కౌంటర్‌ ఇచ్చింది.

దీంతో లాలూ, ఆయన కుమారుడు తేజస్వితో నితీశ్‌ కు మాటల యుద్దం మొదలైంది. ఈ క్రమంలోనే రాహుల్‌ చేపట్టిన జోడో యాత్రకు కూడా నితీశ్‌ దూరంగా ఉన్నారు. దీంతో నితీశ్‌ ఇండియా కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు సమాచారం ఊపందుకుంది. అంతే కాకుండా ప్రధాని అభ్యర్థిగా నితీశ్‌ పేరును ప్రకటించకపోవడంతో నితీశ్‌ అలిగినట్లు తెలుస్తుంది.

ఇప్పుడు ఇండియా కూటమిని కానీ నితీశ్‌ వీడితే ఇండియా కూటమికి ఇది పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పవచ్చు. అందుకే నితీశ్‌ని ఎలాగైనా సరే జోడో యాత్రలో పాల్గొనేలా చేసేందుకు కాంగ్రెస్‌ నేతలు గట్టిగా కృష్టి చేస్తున్నారు

Also read: ఎలా స్పందించాలో తెలియడం లేదు..పద్మవిభూషణ్‌పై చిరంజీవి

#modi #rjd #jdu #nitish-kumar #lalu #i-n-d-i-a #bjp
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి