Megastar Chiranjeevi: దేశ అత్యున్నత రెండవ పురస్కారం పద్మ విభూషణ్ (Padma Vibhushan Award) రావడం మీద చిరంజీవి స్పందించారు. ఆ వార్త తెఇసిన క్షణం నన్ను నేని మర్చిపోయానని అన్నారు. ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలియని పరిస్థిలో ఉండిపోయానని అంటున్నారు. నన్ను ఆదరించిన తెలుగు ప్రజలకు శతకోటి అభివందనాలు అంటూ తెలిపారు. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను మీ సొంత మనిషిగా, అన్నయ్యగా, బిడ్డగా భావించిన కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు…నీడలా నాతో ప్రతీ నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే ఈరోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చారు. నాకు దక్కిన ఈ గౌరవం…నన్ను ఆదరించిన ప్రతీ ఒక్కరిది అంటూ నిగర్వంగా మాట్లాడారు.
పూర్తిగా చదవండి..Chiranjeevi: ఎలా స్పందించాలో తెలియడం లేదు..పద్మవిభూషణ్పై చిరంజీవి
కేంద్ర ప్రభుత్వం తనకు పద్మ విభూషణ్ ఇవ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. దేశంలో అత్యున్నత రెండవ పురస్కారం తనకు రావడం మాట్లలో చెప్పలేనంత ఆనందంగా ఉందని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఏం మాట్లాడాలో, ఎలా చెప్పాలో తెలియడం లేదని ఉద్విగ్నం అయ్యారు.
Translate this News: