WORLDCUP 2023:వరల్డ్‌కప్ లో మొదటి మ్యాచ్...టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కీవీస్

వన్డే వరల్డ్‌కప్ 2023 కు తెరలేచింది. మొదటి మ్యాచ్‌లో పోరుకు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన కీవీస్ కెప్టెన్ బౌలింగ్ ను ఎంచుకున్నాడు.

WORLDCUP 2023:వరల్డ్‌కప్ లో మొదటి మ్యాచ్...టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కీవీస్
New Update

ప్రపంచకప్ క్రికెట్ సమరం మొదలైంది. మరికొన్ని నిమిషాల్లో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ లు తలపడడానికి సర్వం సిద్ధమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లూథమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్రిటిష్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.

ఆడుతున్న తొలి మ్యాచ్ లోని ఇంగ్లండ్ టీమ్ కు పెద్ద దెబ్బ తగిలింది. 2019 వరల్డ్ కప్ హీరో బెన్ స్టోక్స్ లేకుండా ఆ టీమ్ బరిలోకి దిగుతోంది. అతనితో పాటూ అట్కిన్సన్, టాప్లీ, విల్లీలు కూడా జట్టుకు దూరమయ్యారు. మరోవైపు కీవీస్ కెప్టెన్ కేన్ విలియమ్స్ కూడా ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు.దీంతో టామ్ లూథమ్ తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. అలాగే గాయాల కారణంగా లుకీ ఫెర్గూసన్, ఇష్ సోధి, టిమ్ సౌధీ కూడా ఈ మ్యాచ్ ను ఆడటం లేదు.

ఇక బ్రిటిషర్ల జట్టులో బ్యాటర్లే ఎక్కువ మంది ఉన్నారు. అది కూడా అందరూ విధ్వంసకర బ్యాట్స్ మెన్నే కావడం విశేషం. వీళ్‌ళను ఎదుర్కోవాలంటే కీవీస్ జట్టు బాగా కష్టపడాల్సిందే. బెయిర్ స్టో, డేవిడ్ మలన్, హరీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్, మొయిన్ ఆలీ, జోస్ బట్లర్ లు ఇంగ్లండ్ టీమ్ లో ఉన్నారు.

2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌పై బౌండ్రీల లెక్క ఆధారంగా విజయం సాధించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌.. ఈ సారి తొలి మ్యాచ్‌లో కివీస్‌నే ఎదుర్కోనుంది. ఇరు జట్ల మధ్య అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం మూడు వన్డేలు మాత్రమే జరగగా.. ఆ పరాజయానికి బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ బలంగా కోరుకుంటున్నది. అయితే ఇరు జట్లను గాయాల బెడద వెంటాడుతున్నది.

ఎక్కడ చూడొచ్చు…

భారత్‌లోని స్టార్ స్పోర్ట్స్ (Star Sports) నెట్‌వర్క్ టీవీ చానెల్స్‌లో ఈ మ్యాచ్‌లు చూడొచ్చు. డీడీ స్పోర్ట్స్, డీడీ నేషనల్‌లోనూ ఈ మ్యాచ్‌లు వస్తాయి. ఇక ఆన్‌లైన్ విషయానికి వస్తే ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ (Hotstar)లో ఈ మ్యాచ్‌లను లైవ్ చూడొచ్చు. అంతేకాదు తమ మొబైల్ యాప్‌లో ఉచితంగానే ఈ మ్యాచ్‌లను చూడొచ్చని ఇప్పటికే హాట్‌స్టార్ ప్రకటించింది.

ఇంగ్లండ్ జట్టుః జానీ బెయిర్ స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), మొయిన్ అలీ, సామ్ కరన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

కీవీస్ః డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లూథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంటర్స్, జిమ్మీ నీషమ్, మాట్ హెన్రీ, ట్రెంట్ బౌల్ట్.

also read:చూసినోళ్ళకు చూసినంత…క్రికెట్ పండగ మొదలవుతోంది.

#england #match #newzeland #first #2023 #worldcup
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe