Paper Leaks : ఇకనుంచి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే.. కోటీ జరిమానా, పదేళ్లు జైలు శిక్ష

నీట్‌, యూజీసీ-నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ.. ప్రభుత్వ పరీక్షల చట్టం-2024 ను తాజాగా కేంద్రం అమల్లోకి తెచ్చింది. దీనిప్రకారం పరీక్షలో అక్రమాలకు పాల్పడ్డవారికి రూ.కోటీ జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధించనున్నారు.

New Update
UGC-NET: యూజీసీ నెట్ ఎగ్జామ్ కొత్త షెడ్యూల్ ఇదే..

UGC-NET Paper Leak : యూజీసీ-నెట్ పేపర్ లీక్ కావడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే కేంద్రం ఈ పరీక్షను రద్దు చేసింది. త్వరలోనే ఈ పరీక్షకు కొత్త తేదీ ప్రకటించనున్నారు. మరోవైపు నీట్‌ పరీక్ష (NEET Exam) నిర్వహణలో కూడా అవకతవకలు జరగడం, కొందరు విద్యార్థులు తమకు పేపర్ లీకైందని చెప్పడం కూడా సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో పరీక్షల్లో జరిగే అక్రమాలు కట్టడి చేసేందుకు ఉద్దేశించిన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ (Draupadi Murmu).. ప్రభుత్వ పరీక్షల చట్టం-2024 కు నాలుగు నెలల క్రితమే ఆమోదం తెలిపారు. దీంతో తాజాగా చట్ట నిబంధలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

Also Read: ఐటీ రంగంలో ఆగని లేఆఫ్‌లు.. ఈ ఏడాది 98 వేల జాబ్స్‌ కట్‌

జూన్ 21 నుంచే ఈ చట్టం అమల్లోకి రానుంది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే కోటీ రూపాయల వరకు జరిమానా ఉంటుంది. అలాగే గరిష్ఠంగా పదేళ్ల పాటు జైలు శిక్ష ఉంటుంది. యూజీసీ నెట్ (UGC-NET) పేపర్ లీకైన నేపథ్యంలో కేంద్రం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారని కేంద్రవిద్యాశాఖ మంత్రిని అడగగా.. మర్నాడే దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది.

పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు -2024కు ఫిబ్రవరి 6న లోక్‌సభలో ఆమోదం లభించగా.. 9న రాజ్యసభ (Rajya Sabha) ఆమోదం తెలిపింది. అలాగే 12న రాష్ట్రపతి ముర్మూ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. యూపీఎస్సీ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, బ్యాంక్, రైల్వేస్‌, ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో అక్రమాలు అడ్డుకునేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు పేపర్ లీకైన అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న వేళ.. ఈ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది.

Also Read: జమ్మూ కాశ్మీర్‌తోపాటు మరో మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు

Advertisment
తాజా కథనాలు