సోషల్ మీడియాలో మాజీ సీఎం జగన్‌పై మాస్ ట్రోలింగ్ జరుగుతోంది. అబ్దుల్ కలామ్ వర్ధంతి సందర్భంగా జగన్ ట్వీట్ చేశారు. దీనిపై నెటీజన్లు ఫైర్ అవుతున్నారు. అబ్దుల్ కలామ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తునన్నారు. పచ్చి బూతులతో దుమ్మెత్తిపోస్తున్నారు. అబ్దుల్ కలామ్ పేరునే కనిపించకుండా చేసిన వాడివి.. ఇవాళ నీ రాజకీయానికి వాడుకుంటున్నావా అంటూ మండిపడుతున్నారు.
Also Read: పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు.. పోతిన మహేష్‌కు కిరణ్ రాయల్ కౌంటర్..!
ఇదిలాఉండగా.. వైజాగ్‌లో ఉన్న వ్యూ పాయింట్‌కు గతంలో అబ్దుల్ కలాం పేరు ఉండేది. అయితే జగన్ హయాంలో అబ్దుల్ కలాం పేరును తొలగించి YSR వ్యూ పాయింట్‌గా నామకరణం చేశారు. అలాగే APJ అబ్దుల్ కలామ్ పురస్కారాన్ని కూడా YSR విద్యా పురస్కారంగా మార్చారు. కలామ్ పేరుతో విద్యార్థులకు అందించే ప్రోత్సహాలకు కూడా జగనన్న ఆణిముత్యాలుగా మార్చారు. ఇలా అబ్దుల్ కలామ్ పేర్లు మార్చి ఇప్పుడు ఆయన గురించి ట్వీట్ చేయడం వల్లే నెటీజన్లు జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో తీస్తూ..!\