YS Jagan: నీకు ఆ అర్హత లేదు.. జగన్ ట్వీట్‌పై నెటిజన్లు ట్రోలింగ్! అబ్దుల్ కలామ్ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం జగన్ ట్వీట్ చేయడంతో ఆయనపై నెటీజన్లు ఫైర్ అవుతున్నారు. గతంలో వైజాగ్‌లో ఉన్న అబ్దుల్ కలాం వ్యూ పాయింట్‌కు YSR పేరు మార్చడం, కలామ్ పురస్కారాన్ని కూడా YSR పురస్కారంగా మార్చడంతో కలామ్ పేరు తలిచే అర్హత లేదని మండిపడుతున్నారు. By B Aravind 27 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి సోషల్ మీడియాలో మాజీ సీఎం జగన్‌పై మాస్ ట్రోలింగ్ జరుగుతోంది. అబ్దుల్ కలామ్ వర్ధంతి సందర్భంగా జగన్ ట్వీట్ చేశారు. దీనిపై నెటీజన్లు ఫైర్ అవుతున్నారు. అబ్దుల్ కలామ్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తునన్నారు. పచ్చి బూతులతో దుమ్మెత్తిపోస్తున్నారు. అబ్దుల్ కలామ్ పేరునే కనిపించకుండా చేసిన వాడివి.. ఇవాళ నీ రాజకీయానికి వాడుకుంటున్నావా అంటూ మండిపడుతున్నారు. Also Read: పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే స్థాయి నీది కాదు.. పోతిన మహేష్‌కు కిరణ్ రాయల్ కౌంటర్..! ఇదిలాఉండగా.. వైజాగ్‌లో ఉన్న వ్యూ పాయింట్‌కు గతంలో అబ్దుల్ కలాం పేరు ఉండేది. అయితే జగన్ హయాంలో అబ్దుల్ కలాం పేరును తొలగించి YSR వ్యూ పాయింట్‌గా నామకరణం చేశారు. అలాగే APJ అబ్దుల్ కలామ్ పురస్కారాన్ని కూడా YSR విద్యా పురస్కారంగా మార్చారు. కలామ్ పేరుతో విద్యార్థులకు అందించే ప్రోత్సహాలకు కూడా జగనన్న ఆణిముత్యాలుగా మార్చారు. ఇలా అబ్దుల్ కలామ్ పేర్లు మార్చి ఇప్పుడు ఆయన గురించి ట్వీట్ చేయడం వల్లే నెటీజన్లు జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Also Read: అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం.. సెల్ఫీ వీడియో తీస్తూ..!\ దేశం గర్వించే శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. ``కలలు కనండి. వాటిని సాకారం చేసుకోండి`` అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ ఆయన. ఒక మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన… — YS Jagan Mohan Reddy (@ysjagan) July 27, 2024 నీకు కలాం గారి పేరు తలిచే అర్హత ఉందా జగన్ ? గత 5 ఏళ్ళు ఆయన్ని అవమానించినందుకు, ముందు క్షమాపణ చెప్పి, అప్పుడు మాట్లాడు. pic.twitter.com/IrCmgN5HQF — Mr Yash (@YashTDP_) July 27, 2024 #andhra-pradesh #telugu-news #jagan #apj-abdul-kalam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి