Kota : కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది తొమ్మిదో ఘటన

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా ఆగడం లేదు. తాజాగా హర్యానాకు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాదిలో ఇది తొమ్మిదో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Student Suicide : రాజస్థాన్‌(Rajasthan) లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు(Suicides) ఇంకా ఆగడం లేదు. చదువుల ఒత్తిడి కారణంగా వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఏడాదిలో ఇది తొమ్మిదో ఘటన కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హర్యానా(Haryana) కు చెందిన సుమిత్ అనే 20 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. గత ఏడాది నుంచి కోటాలోని కున్హాడి ల్యాండ్‌మార్క్‌ సిటీలో ఉన్న హాస్టల్‌ ఉంటూ.. ఓ ప్రైవేట్ సెంటర్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే ఆదివారం సాయంత్రం తాను ఉంటున్న గదిలో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Also read: రిజర్వేషన్ల రద్దు మీద హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో..కేసులు నమోదు

ఆదివారం సాయంత్రం సుమిత్‌ తల్లిదండ్రులు అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో.. హాస్టల్ వార్డెన్‌కు ఫోన్ చేశారు. దీంతో హాస్టల్(Hostel) సిబ్బంది సుమిత్ గది వద్దకు వెళ్లగా అప్పటికే అతడు ఉరేసుకుని కనిపించాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

ఇదిలా ఉండగా ప్రవేశ పరీక్షలకు కోచింగ్ హబ్‌ అయిన కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. అధికారులు వీటిని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నా కూడా ఆగడం లేదు. తాజాగా సుమిత్‌ సూసైడ్‌తో కలిపి ఈ ఏడాది కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య తొమ్మిదికి చేరింది. గత ఏడాది కూడా ఏకంగా 30 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపింది.

Also Read: వాట్సాప్‌.. భారత్‌ను విడిచి వెళ్తుందా ? ఈ ఐదు విషయాలు తెలుసుకోండి

Advertisment
తాజా కథనాలు