Sports : పారిస్ నుంచి జర్మనీకి... నెల తరువాత భారత్‌కు నీరజ్ చోప్రా

భారత అథ్లెట్ , రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా పారిస్ నుంచి డైరెక్ట్‌గా జర్మనీ వెళ్ళనున్నాడు. నెల రోజులు అక్కడే ఉండి భారత్‌కు తిరిగి రానున్నాడు. తన గాయానికి ఆపరేషన్ చేయించుకోవడానికే నీరజ్ అక్కడికి వెళ్తున్నాడని తెలుస్తోంది.

ASIAN GAMES 2023: మరో గోల్డ్ కొట్టిన బల్లెం వీరుడు.. ఏషియన్‌ గేమ్స్‌లో నీరజ్‌ చోప్రా సత్తా!
New Update

Germany : భారత స్టార్ జావెలిన్ త్రో (Javelin Throw) ప్లేయర్ నీరజ్ చోప్రా ఇప్పుడు మిగతా అథ్లెట్లతో పాటూ ఇండియా (India) కు తిరిగి రావడం లేదు అతను పారిస్ నుంచి జర్మనీ వెళుతున్నాడు. ఒలింపిక్స్‌లో పాల్గొనక ముందు నుంచే నీరజ్ గజ్జల్లో గాయం కారణంగా బాధపడుతున్నాడు. ఈ గాయం కాస్తా పెద్దది అవ్వడం వల్లనే బంగారు పతకాన్ని కూడా కోల్పోవలసి వచ్చిందని నీరజ్ చెప్పాడు. ఇప్పుడు దీనికి శస్త్రచికిత్స చేయించుకోవడానికే అతను జర్మనీ వెళుతున్నట్టు తెలుస్తోంది. దాంతో పాటూ రాబోయే డైమండ్ లీగ్‌లో పాల్గొనాలా వద్దా అనే విషయానికి సంబంధించి కూడా వైద్య సలహా తీసుకోనున్నాడు. దీంతో నీరజ్ మరో 45 రోజులు కనీసం భారత్‌కు తిరిగి వచ్చే అవకాశం లేదని అతని బంధువులు చెబుతున్నారు.

పారిస్‌లోని భారత ఒలింపిక్ అసోసియేషన్‌ వర్గాలు కూడా నీరజ్‌ జర్మనీకి వెళ్లినట్లు ధ్రువీకరించాయి. చోప్రా (Neeraj Chopra) తన గాయం గురించి గతంలో కూడా జర్మనీలోని వైద్యుడిని సంప్రదించాడు. అలాగే ఈ ఒలింపిక్స్‌కు ముందు కొన్నిరోజులు జర్మనీలోని సార్‌బ్రూకెన్‌లో నీరజ్ శిక్షణ పొందాడు. ఇక డైమండ్ లీగ్స్ సెప్టెంబర్ 14న బెల్జియంలోని బ్రస్సెల్‌లో జరగనుంది. దీనిలో ఆడాలనుకుంటున్నాని నీరజ్ ఒలింపిక్స్‌కు ముందు చెప్పాడు. మరి ఇప్పుడు గాయం వలన ఆడగలడో లేదో తెలియదు. జర్మనీ వెళ్ళి అక్కడ వైద్యులతో మాట్లాడాకనే ఈ విషయం మీద అతను నిర్ణయం తీసుకుంటాడు.

మరోవైపు ఈ సీజన్‌లో నీరజ్‌ మే 10న దోహాలో జరిగిన డైమండ్‌ లీగ్‌ (Diamond League) లో మాత్రమే ఆడాడు. అక్కడ అతనికి సెకండ్ వచ్చింది. ఈ లీగ్‌ ఫైనల్‌ పాయింట్ల పట్టికలో నీరజ్ ప్రస్తుతం ఏడు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. నీరజ్‌ ఈ ఫైనల్‌లో ఆడాలంటే కనీసం మరో డైమండ్‌ లీగ్‌లో ఆడాల్సి ఉంటుంది. డైమండ్ లీగ్‌ల్లో మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన అథ్లెట్లు ఫైనల్‌లో పోటీపడతారు.

Also Read: Kolkata: కోల్‌కత్తా అత్యాచారం సంఘటనలో వెలుగులోకి నమ్మలేని నిజాలు

#paris-olympics-2024 #germany #javelin-throw #neeraj-chopra #india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe