Times Now ETG Survey: హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ...టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియన్ పోల్

మళ్ళీ అధికారం ఎన్డీయేదే అంటోంది టైమ్స్ నౌ నవజీవన్, ఈటీజీ ఒపీనియన్ పోల్. మూడోసారి ముచ్చటగా గెలిచి హ్యాట్రిక్ కొడుతుందని చెప్పింది. 323 సీట్లతో ఢంకా బజాయించడం గ్యారంటీ అంటూ అంచనా వేసింది.

New Update
Times Now ETG Survey: హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ...టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియన్ పోల్

Times Now ETG Opinion Poll: లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీని కోసం పార్టీలు, నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది అంటూ సర్వేలు, ఒపినీయన్ పోల్స్ నిర్వహించేస్తున్నాయి ప్రముఖ వార్తాపత్రికలు. తాజాగా టైమ్స్ నౌ నవజీవన్, ఈటీజీ ఒపినీయన్ పోల్ ప్రకటించింది. దీని ప్రకారం ఈసారి కూడా మళ్ళీ అధికారంలోకి ఎన్డీయే (NDA) వస్తుంది. బీజేపీని అడ్డుకునేవారే లేరంటోంది ఒపినీయన్ పోల్. మొత్తం 543 స్థానాల్లో ఎన్డీయే కూటమికి ఏకంగా 323 సీట్లొస్తాయని అంచనా వేసింది. ఇండియా కూటమి (India Alliance) కేవలం 163 సీట్లకు మాత్రమే పరిమితమౌతుంది అని తేల్చింది. మిగతా పార్టీలు అన్నీ కలిపి 57 స్థానాలు దక్కించుకుంటాయని తెలిపింది.

Also Read: బంగారం కొనాలంటే బీ రెడీ.. మళ్ళీ తగ్గిన బంగారం.. వెండి ధరలు ఢమాల్..

ఇంతకు ముందు కూడా టైమ్స్ నౌ ఇలానే సర్వేలు, ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది. రీసెంట్ గా జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల ఎన్నికల ముందు కూడా ఒపీనియన్ పోల్ నిర్వహించి..బీజేపీ (BJP) క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పింది. అలాగే 2024 లోక్ సభ ఎన్నికల్లో ఒక్క బీజేపీనే 308-328 పీట్లను ఎగురేసుకుని పోతుందని చెబుతోంది టైమ్స్ నౌ ఈటీజీ పోల్. అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం 52-72 సీట్లు మాత్రమే సంపాదించుకుని మరోసారి ఘోర పరాభవం చూస్తుందని అంటోంది. కాంగ్రెస్ ఇండియా కూటమిని కలుపుకుని వచ్చినా పెద్దగా ఇంపాక్ట్ చూపించదని ఒపీనియన్ పోల్ అంచనా.

2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 353 సీట్లు సంపాదించుకుంటే...కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏకు 93 సీట్లు వచ్చాయి. ఇతరులకు 96 స్థానాలు దక్కాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు