Opinion Poll : ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ దే అధికారం.. సంచలన సర్వే.. సీట్ల లెక్కలివే..!!
మరికొన్ని రోజుల్లో ఐదురాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోకసభ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కీలకంగా మారనున్నాయి. ప్రజల నాడీ తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. అయితే మధ్యప్రదేశ్ కు సంబంధించి టైమ్స్ నౌ నవభారత్ ఈటీజీ ఒపీనియన్ పోల్ సర్వే తన ఫలితాలను వెల్లడించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య పోరు హోరాహోరీగా ఉన్నప్పటికీ...కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని సర్వే తేల్చి చెప్పింది. అధికార బీజేపీకి ఎన్ని సీట్లు, కాంగ్రెస్ పార్టీకి గెలుచుకునే స్థానాలెన్నో చూద్దాం.