Crime : ముదిరిన మూఢ నమ్మకం.. పాము కాటుకు చనిపోయిన వ్యక్తిని గంగా నది ప్రవాహంలో వేలాడదీసి...!
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు గంగా నదిలో రెండు రోజుల పాటు వేలాడదీశారు. గంగానదిలో ఉంచితే విషం పోతుందని కొందరు చెప్పడంతో వారు ఇలా చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.