DNA: కుటుంబాల్లో పెద్దలు, పలువురి సందేహాలు కొన్నిసార్లు సంబంధాల పునాదిని కదిలిస్తాయి. ఇవి కొన్నిసార్లు కుటుంబాలను నాశనం కూడా చేస్తాయి. సరిగ్గా ఓ మహిళ విషయంలోనూ ఇదే జరిగింది. మనవరాలు పుట్టినప్పుడు చాలా సంతోషించింది బామ్మ. ఏళ్ల తరబడి పెంచింది. కానీ ఒకరోజు తన మనసు కలవరపడింది. ఎందుకంటే 15 ఏళ్ల మనవరాలు లిండ్సే తన ఇతర తోబుట్టువుల కంటే భిన్నంగా కనిపించింది. మనవరాలికి తన కుటుంబంలో ఎవరి పోలికలు రాకపోవడంతోపాటు వింత అలవాట్లు ఉన్నాయనే కారణంగా సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారు రంగు రింగుల జుట్టు కలిగివున్న బాలిక బహుశా తమ కుటుంబానికి చెందిన కూతురు కాదేమో అని భావించిన బామ్మ.. మనవరాలికి DNA టెస్ట్ చేయించగా అసలు విషయం బయటపడింది.
పూర్తిగా చదవండి..Viral story: కోడలిపై అనుమానంతో డీఎన్ఏ టెస్ట్ చేయించిన అత్త.. ఊహించని షాక్ ఇచ్చిన కొడుకు!
మనవరాలికి తమ కుంటుంబ పోలికలు లేవని కోడలును అనుమానించిన ఓ అత్త బాలికకు డీఎన్ఏ టెస్ట్ చేయించగా షాకింగ్ సీక్రెట్ బయటపడింది. కొడుకు మరొక మహిళతో కన్నబిడ్డను రహస్యంగా పెంచుకుంటున్నట్లు తెలిసి షాక్ అయింది. ఇంట్రెస్టింగ్ స్టోరీ వైరల్ అవుతుండగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
Translate this News: