Haryana Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అంబాలా-ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై అతివేగంతో వెళ్తున్న ట్రక్కు మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు.
హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అంబాలా-ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై అతివేగంతో వెళ్తున్న ట్రక్కు మినీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు.
జార్ఖండ్ తరువాత కేరళలోని పౌల్ట్రీఫామ్ లలో బర్డ్ ఫ్లూ నిర్దారించారు. మానర్కాడ్ లోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారమ్ లో ఏవియన్ ఫ్లూ విస్తారంగా వ్యాప్తి చెందినట్లు జిల్లా యంత్రాంగం ధృవీకరించింది.
దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 48 డిగ్రీల ఉష్ణోగ్రత దాటేసింది. రాజస్థాన్ లోని బార్మర్ లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అత్యధికంగా 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.
రేవ్ పార్టీతో తనకు సంబంధాలున్నాయనే వార్తలపై నటుడు శ్రీకాంత్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనవసరంగా తనను ఇందులోకి లాగితే మీడియా, బెంగళూర్ పోలీసులకు నోటీసులు ఇస్తానని చెప్పాడు. శ్రీకాంత్ అంటే ఫ్యామిలీ మ్యాన్. ఇలాంటి ఆరోపణలు కరెక్ట్ కాదన్నారు.
పూణెలోని కళ్యాణి నగర్లో లగ్జరీ పోర్షే కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మరణించిన కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కారు ప్రమాదం జరిగినపుడు డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నట్లు నిందితుడి తండ్రి తెలిపాడు. దీంతో డ్రైవర్, సురేంద్ర అగర్వాల్‌ను పూణే క్రైమ్ బ్రాంచ్ ప్రశ్నిస్తోంది.
పెళ్లి పందిట్లో కాబోయే భార్యకు పెట్టిన ముద్దు వరుడి ప్రాణాల మీదకు వచ్చింది. వరమాల వేయగానే బహిరంగంగా ముద్దు పెట్టడంపై పెళ్లి కూతురు బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు కుటుంబాలు కర్రలతో కొట్టుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది.
ఎన్నికల ప్రచారంలో మోడీని లేపేస్తామంటూ అగంతకుడి నుంచి బెదిరింపు కాల్ రావడం కలకలం రేపుతోంది. అప్రమత్తమైన చెన్నైలోని ఎన్ఐఏ ఆ కాల్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
కర్ణాటకలో లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని తాత, మాజీ ప్రధాని దేవెగౌడ.. ప్రజ్వల్‌ను ఇండియాకు వచ్చి లొంగిపోవాలని సూచించారు. తన సహనాన్ని ఇక పరీక్షించకూడదంటూ హెచ్చరించారు.
రాంగ్ రూట్ లో వెళ్ళిపోయి ఎదో టైమ్.. పెట్రోల్ సేవ్ చేసేద్దామని ఆలోచించే వారికీ షాక్ ఇచ్చేలా టైర్ కిల్లర్ బ్రేక్ వచ్చేసింది. అహ్మదాబాద్, రాయ్ పూర్ వంటి నగరాల్లో వీటిని అమర్చారు. ఎవరైనా రాంగ్ రూట్ లో వెళితే ఆ వాహనం టైర్లు పంక్చర్ అయిపోతాయి. ఎందుకో ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు