Bird Flue: కేరళలో విస్తరిస్తున్న బర్డ్‌ ఫ్లూ..అప్రమత్తమైన యంత్రాంగం!

జార్ఖండ్‌ తరువాత కేరళలోని పౌల్ట్రీఫామ్‌ లలో బర్డ్‌ ఫ్లూ నిర్దారించారు. మానర్కాడ్‌ లోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారమ్‌ లో ఏవియన్‌ ఫ్లూ విస్తారంగా వ్యాప్తి చెందినట్లు జిల్లా యంత్రాంగం ధృవీకరించింది.

New Update
Australia: భారత్‌ నుంచి ఆస్ట్రేలియాకు బర్డ్‌ఫ్లూ కేసు-డబ్ల్యూహెచ్‌వో

Bird Flu in Kerala: జార్ఖండ్‌ తరువాత కేరళలోని పౌల్ట్రీఫామ్‌ లలో బర్డ్‌ ఫ్లూ నిర్దారించారు. మానర్కాడ్‌ లోని ప్రభుత్వ ప్రాంతీయ కోళ్ల ఫారమ్‌ లో ఏవియన్‌ ఫ్లూ (Avian flu) విస్తారంగా వ్యాప్తి చెందినట్లు జిల్లా యంత్రాంగం ధృవీకరించింది. పౌల్ట్రీ ఫారమ్‌కు ఒక కిలోమీటరు పరిధిలో ఉన్న పెంపుడు పక్షులన్నింటినీ చంపాలని నిర్ణయం తీసుకున్నట్లు కొట్టాయం జిల్లా అధికార యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది.

జిల్లాలో కోడి, బాతు, పిట్ట, ఇతర పక్షుల పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయాలను ప్రభుత్వం నిషేధించింది. ప్రభావిత ప్రాంతంలో క్రిమిసంహారక చర్యలు తీసుకుంటామని, పౌల్ట్రీ ఫారం నుండి 1 నుండి 10 కి.మీ వ్యాసార్థాన్ని నిఘా జోన్‌గా ప్రకటించామని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Also Read: నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో వర్షాలు!

ఇదిలా ఉంటే రాష్ట్రంలోని కొట్టాయం జిల్లాలో చికెన్, బాతు, పిట్ట, ఇతర పక్షుల పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకం, దిగుమతిపై నిషేధం విధించడం జరుగుతుంది. పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పౌల్ట్రీ ఫారంలో ఏవియన్ ఫ్లూ వ్యాపించినట్లు జిల్లా కలెక్టర్ వి.విఘ్నేశ్వరి నిర్ధారించడంతో కలెక్టరేట్‌లో జరిగిన అంతర్‌ శాఖల సమావేశంలో ఈ చర్యలు చేపట్టారు. ఫారంలో సుమారు తొమ్మిది వేల కోళ్లను పెంచినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు