అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..నవంబర్ 17 నుంచి తెరుచుకుంటున్న శబరిమల ఆలయం!
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆలయాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు . ఈ నెల 17 నుంచి అయ్యప్ప ఆలయం తెరచుకోనున్నట్లు మంత్రి రాధాకృష్ణ వెల్లడించారు.
శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆలయాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు . ఈ నెల 17 నుంచి అయ్యప్ప ఆలయం తెరచుకోనున్నట్లు మంత్రి రాధాకృష్ణ వెల్లడించారు.
నవోదయ విద్యాలయాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం ఇవాళే చివరి తేదీ. దరఖాస్తు చేసుకోని వారు ఇవాళ సాయంత్రంలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పరీక్ష 10 ఫిబ్రవరి 2024న ఉంటుంది. హాల్ టికెట్లు navodaya.gov.in అందుబాటులో ఉండనున్నాయి.
సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ (75) మంగళవారం ముంబైలో మరణించారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు నోటీసులు ఇచ్చింది. తమకు వచ్చిన ఎలక్ట్రోరల్ బాండ్స్ వివరాలు అందించాలని నోటీసుల్లో పేర్కొంది. రేపు సాయంత్రం 5గంటల వరకు వివరాలు అందించాలని ఆదేశించింది.
బంగారం కొనేముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే మార్కెట్లో నకిలీ బంగారంతో మోసం చేసేవాళ్లుంటారు. కాబట్టి అసలు, నకిలీకి మధ్య తేడాతోపాటు మ్యాన్ మేడ్ లేదా మెషిన్ మేడ్, ప్యూర్ గోల్డ్, బరువు, మేకింగ్ ఛార్జీలు వంటి వాటిపై అవగాహన ఉండాలంటున్నారు.
వీధి కుక్కల దాడి కేసులో పంజాబ్-హరియాణా హైకోర్టు మంగళవారం ఆసక్తికరమైన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో కుక్క, ఇతర జంతువులు కరిస్తే ఒక్కో పంటి గాటుకు కనీసం రూ.10వేలు చెల్లించాల్సిన పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) దేశంలో క్రికెట్‌ను నాశనం చేస్తోందని మాజీ కెప్టెన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలను మహమ్మద్ అమీర్ తప్పుబట్టారు. కెప్టెన్ బాబర్ విఫలమైతే బోర్ట్ ఫెయిల్ అయినట్లు కాదన్నారు. నాణ్యమైన క్రికెటర్లను తయారు చేయడంలో ధోనిని చూసి నేర్చుకోవాలన్నారు.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ మరోసారి లే ఆఫ్ ప్రకటించింది. తన గేమింగ్ డివిజన్ నుంచి సుమారు 180 మంది ఉద్యోగులను తొలిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
నటి మృణాల్ ఠాకూర్, సింగర్ బాద్ షా డేటింగ్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కాగా తాజాగా దీనిపై స్పందించాడు బాద్ షా. నిజానికి అందరూ అనుకున్నట్లు తమ మధ్య డేటింగ్ రిలేషన్ లేదని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశాడు.