మృణాల్ ఠాకూర్‌తో లవ్ ఎఫైర్.. ఎట్టకేలకు నిజం చెప్పేసిన సింగర్ బాద్షా నటి మృణాల్ ఠాకూర్, సింగర్ బాద్ షా డేటింగ్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. కాగా తాజాగా దీనిపై స్పందించాడు బాద్ షా. నిజానికి అందరూ అనుకున్నట్లు తమ మధ్య డేటింగ్ రిలేషన్ లేదని, సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ పుకార్లేనని కొట్టిపారేశాడు. By srinivas 14 Nov 2023 in సినిమా నేషనల్ New Update షేర్ చేయండి బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్‌తో డేటింగ్ ఇష్యూపై ఎట్టకేలకు స్పందించాడు సింగర్ బాద్ షా. కొంతకాలంగా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, త్వరలోనే పెళ్లి ప్రకటన కూడా చేయబోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు ఈ స్టార్స్ ఇద్దరూ పలుపార్టీల్లోనూ సన్నిహితంగా కనిపించడం, ఒకరినొకరు పొగిడేసుకోవడంతో నెటిజన్లు పక్కా డేటింగ్ లో ఉన్నారంటూ రచ్చ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి దీపావళి సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన మృణాల్, బాద్షా ఈ సెలబ్రేషన్స్ లో హంగామా చేశారు. అంతటితో ఆగకుండా అందులో శిల్పా శెట్టి, బాద్షాలతో దిగిన ఫొటోలను మృణాల్ తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. ‘నాకు అత్యంత ఇష్టమైన వారు’ అని క్యాప్షన్ రాశారు. ఇక పార్టీ అయిపోయాక కూడా వీరిద్దరూ చనువుగా ఉన్నట్లు కనిపించడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వాళ్లు ప్రేమించుకుంటున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించిన సింగర్ బాద్షా.. సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చాడు. ‘డియర్ ఇంటర్నెట్. మరోసారి నిరాశపరుస్తున్నందుకు క్షమించు. ప్రస్తుతం మా గురించి వెలువడుతున్న వార్తలు ఏవీ నిజం కాదు’ అంటూ ఓ ఫన్నీ ఎమోజీని పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్ట్ సైతం వైరల్ అవుతుండగా లవ్ పుకార్లకు చెక్ పడినట్లైంది. ఇక బాలీవుడ్ సింగర్ అండ్ యాక్టర్ అయిన బాద్ షా అసలు పేరు.. ఆదిత్య ప్రతీక్ సింగ్. కాగా దీనిపై మృణాల్ ఎలా స్పందిస్తుందో చూడాలంటున్నారు ఫ్యాన్స్. Also read :భార్య బర్త్ డే డేట్ మరిచిపోతున్నారా.. ఐదేండ్లు జైలు శిక్ష తప్పదు ఇదిలావుంటే మృణాల్ ఠాకూర్ నటించిన తాజా తెలుగు చిత్రం 'హాయ్ నాన్న'. నాని హీరోగా వస్తున్న ఈ సినిమాను శౌర్యువ్ తెరకెక్కించగా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో భాగంగానే ఇటీవల విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. నాన్న, లవర్‌గా నాని అదరగొట్టేసినట్లు కనిపిస్తోంది. కూతురు ప్రేమకు, అమ్మాయి ప్రేమకు మధ్యలో సాగే కథగా కనిపిస్తున్న ఈ మూవీలో నాని, మృణాళ్ లిప్ లాక్స్ సీన్స్ మాత్రం టీజర్‌కే హైలెట్ గా నిలవడం విశేషం. #badshah #reacts #on-love-affair #mrinal-thakur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి