బంగారం కొనేముందు ఇవి తెలుసుకుంటున్నారా.. లేదంటే మోసపోతారు బంగారం కొనేముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే మార్కెట్‌లో నకిలీ బంగారంతో మోసం చేసేవాళ్లుంటారు. కాబట్టి అసలు, నకిలీకి మధ్య తేడాతోపాటు మ్యాన్ మేడ్ లేదా మెషిన్ మేడ్, ప్యూర్ గోల్డ్, బరువు, మేకింగ్ ఛార్జీలు వంటి వాటిపై అవగాహన ఉండాలంటున్నారు. By srinivas 14 Nov 2023 in బిజినెస్ Latest News In Telugu New Update షేర్ చేయండి మన దేశంలో బంగారం కొనడమంటే ఇంటికి లక్ష్మీ దేవిని ఆహ్వానించినట్లుగా అనుభూతి చెందుతారు. ముఖ్యంగా హిందూ మత సంప్రదాయం ప్రకారం చాలా మంది ‘ధంతేరస్’ రోజున బంగారం కొనడాన్ని శుభప్రదంగా భావిస్తారు. పైగా బంగారం కొనడం అంటే ఖర్చుగా కాకుండా పెట్టుబడిగానే చూడొచ్చు. ఎప్పటికీ ధర తగ్గని బంగారాన్ని అందమైన ఆభరణాలుగా మార్చుకోవచ్చు. కష్టాల్లో అవసరమైతే అమ్మొచ్చు. కానీ మార్కెట్‌లో నకిలీ బంగారంతో మోసం చేసేవారి సంఖ్య పెద్దదే. కాబట్టి అసలు, నకిలీకి మధ్య తేడా తెలుసుకుంటే మోసపోకుండా సురక్షితంగా ఉండొచ్చు. కాబట్టి గోల్డ్ తీసుకునేముందు ఈ కింది విషయాలను తప్పక తెలుసుకోవాలని అంటున్నారు నిపుణులు. మ్యాన్ మేడ్ లేదా మెషిన్ మేడ్ : యంత్రంతో తయారు చేసిన జ్యువెల్లరీ, మానవ నిర్మిత ఆభరణాల ఛార్జీలు భిన్నంగా ఉంటాయి. యంత్రంతో తయారు చేయబడిన ఆభరణాలు చౌకగా ఉంటాయి. బరువు చూడండి: బంగారు ఆభరణాలను తూకంలో విక్రయిస్తారు. మీరు ఎంత కొంటున్నారు? ఎంత చెల్లిస్తున్నారు? రెండు సరిపోతున్నాయా లేదా చెక్ చేసుకోండి. Also read : కుక్క కరిస్తే ప్రభుత్వానికి రూ.10వేల ఫైన్.. పంజాబ్-హరియాణా హైకోర్టు సంచలన తీర్పు ప్యూర్ గోల్డ్: బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో సూచిస్తారు. 24 క్యారెట్ గోల్డ్ 99.9 శాతం స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం 92 శాతం స్వచ్ఛమైనది. ప్రతి క్యారెట్ బంగారం 4.2 శాతం స్వచ్ఛమైన బంగారంతో సమానం. మేకింగ్ ఛార్జీలు: మేకింగ్ ఛార్జీలు.. కస్టమర్లను మోసం చేసే మరో మార్గం. ప్రతి బంగారు ఆభరణానికి మేకింగ్ ఛార్జీలు ప్రస్తుత బంగారం ధరలలోనే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సేల్స్: బంగారం కొనుగోళ్లలో విజృంభణతో వాటి ధరలు స్థిరంగా పెరుగుతాయి. అందువల్ల ధరలు తక్కువగా ఉన్నప్పుడు మరియు అనేక ఆఫర్‌లు ఉన్నప్పుడు ఆఫ్-సీజన్‌లో బంగారం కొనడం మంచిది. బంగారం కొనేముందు ఇవి తెలుసుకుంటున్నారా.. లేదంటే మోసపోతారు #important-things #buying-gold #precautions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి