Video: దివాళి సరదా.. ప్రాణం తీసిన ఛాలెంజ్, ఏం జరిగిదంటే!

టపాసులపై స్టీల్‌బాక్స్ పెట్టి దానిపై కూర్చోమని సవాలు విసిరిన స్నేహితుల అరాచకానికి నిండు ప్రాణం బలైంది. బెంగళూరులోని కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధి వీవర్స్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శబరీష్‌.. చికిత్స పొందుతూ నవంబర్ 2న మృతి చెందాడు.

New Update
Sabareesh sitting on Crackers

కొన్నిసార్లు ఊహించని సంఘటనలు ప్రాణాల మీదకు తెస్తుంటాయి. సరదా సరదాకే చేసిన విన్యాసాలు కుటుంబాల్లో విషాదం నింపుతాయి. తాజాగా అలాంటిదే జరిగింది. క్రాకర్స్‌పై స్టీల్ బాక్స్ పెట్టి దానిపై కూర్చోమని సవాలు విసిరిన స్నేహితుల అరాచకానికి నిండు ప్రాణం బలైంది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read:   ఉచిత సిలిండర్ పొందాలంటే.. ఇవి తప్పనిసరి!

దేశవ్యాప్తంగా దీపావళి సంబురాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగానే బెంగళూరులోని కోననకుంటె పోలీస్ స్టేషన్ పరిధి వీవర్స్ కాలనీకి చెందిన కొందరు యువకులు దిపావళికి కొనుక్కున్న టపాసులను పేల్చేందుకు ఒక దగ్గర గుమిగూడారు. అందులో మద్యం మత్తులో ఉన్న తన స్నేహితుడికి మిగతా వాళ్లు సవాల్ విసిరారు. 

Also Read: JEE అభ్యర్థులకు అలెర్ట్.. ఈసారి కీలక మార్పులు!

క్రాకర్లపై స్టీల్ బాక్స్ పెట్టి కూర్చోమని 32 ఏళ్ల శబరీష్ అనే వ్యక్తికి స్నేహితులు సవాలు విసిరారు. ఈ ఛాలెంజ్‌లో గెలిస్తే ఆటో గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. ఇక మద్యం మత్తులో ఉన్న శబరీస్ వారు చెప్పిందే చేశాడు. క్రాకర్లపై స్టీల్ బాక్స్ పెట్టి దానిపై కూర్చున్నాడు. దీంతో ఒక్కసారిగా క్రాకర్లు పేలడంతో శబరీష్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

Also read:  శబరిమల యాత్రికులకు శుభవార్త.. ఉచిత బీమా కవరేజీ 

వెంటనే శబరీష్‌ని హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. పరిస్థితి విషమించడంతో శబరీష్ చికిత్స పొందుతూ నవంబర్ 2న మృతి చెందాడు. అందుకు సంబంధించిన సీసీ పుటేజ్‌ను పరిశీలించిన కొనకుంటె పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. 

గాంధీ విగ్రహానికి ఘోర అవమానం

Also Read:  కార్తీకంలో ఈ పనులు చేస్తే.. ముల్లోకాల పుణ్యమంతా మీ సొంతం

సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. అయితే దీపావళి రోజు కొందరు యువకులు గాంధీ విగ్రహానికి అవమాన పరిచారు. దీపావళి పండుగ రోజు గాంధీ విగ్రహం సమీపంలో క్రాకర్స్ కాల్చాడానికి కొందరు యువకులు వచ్చారు. అయితే అప్పటి వరకు క్రాకర్స్ కాల్చి సందడి చేశారు. 

కానీ ఓ యువకుడు మాత్రం చేసిన నిర్వాకం నెట్టింట చక్కర్లు కొడుతుంది. గాంధీ విగ్రహం వద్దకు వెళ్లిన ఓ యువకుడు లక్ష్మీ బాంబును మహాత్ముని నోటిలో పెట్టి నిప్పంటించాడు. ఆపై బాంబు పేలగానే ఆ చుట్టూ ఉన్న వారంతా కేకలు వేయడం ఆ వీడియోలో వినిపిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. అలా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు