భారత్‌ సెక్యూలర్ దేశంగా ఉండొద్దని కోరుతున్నారా ?.. పిటిషినర్లకు సుప్రీం చురకలు

రాజ్యాంగం పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్టు అన్న పదాలను తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(PIL) విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియా లౌకిక దేశంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా ? అంటూ ప్రశ్నించింది.

New Update
SC

రాజ్యాంగం పీఠిక నుంచి సెక్యులర్, సోషలిస్టు అన్న పదాలను తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై(PIL) విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియా లౌకిద దేశంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా ? అంటూ ప్రశ్నించింది. రాజ్యాంగ నిర్మాణంలో లౌకికత్వం అంతర్గత భాగమని నొక్కిచెప్పింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్‌లో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ.. తీసుకొచ్చిన 42వ రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ.. బీజేపీ సీనియర్ నేతలు డా.సుబ్రహ్మణ్య స్వామి, బలరాం సింగ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగ పీఠకలో పొందుపరిచిన సోషలిజం, సెక్యులర్ అనే పదాలను తొలగించాలని కోరారు. 

Also Read: 16 మంది పిల్లల్ని కనండి: కొత్త జంటలకు సీఎం స్టాలిన్ సూచన

అలా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు

ఈ నేపథ్యంలో సోమవారం ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టీస్ సంజీవ్ కన్నా మాట్లాడుతూ భారత్‌ లౌకిక దేశంగా ఉండాలని మీరు కోరుకోవడం లేదా అంటూ ప్రశ్నించారు. సోషలిజం అనే పదాన్ని పాశ్చాత్య సందర్భంలో అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని.. ఈ పదం అందరీ సమాన అవకాశాలు ఇవ్వాలనే అర్థాన్ని కూడా సూచిస్తుందని పేర్కొన్నారు. లౌకికత్వం అనేది ఎప్పటికీ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ కోర్టులో అనేక తీర్పులు వచ్చాయని గుర్తుచేశారు. రాజ్యాంగంలో వినియోగించిన సమానత్వ హక్కు, సోదరాభావం అనే పదం.. రాజ్యాంగ ప్రధాన లక్షణంగా లౌకికత్వాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు. ఫ్రెంచ్ మోడల్ సెక్యులరిజం కాకుండా.. భారత్ కొత్త మోడల్ సెక్యులరిజాన్ని స్వీకరించింజని జస్టీస్ ఖన్నా వ్యాఖ్యానించారు.   

Also Read: సల్మాన్‌కు ఆ విషయం తెలియదు.. మాజీ ప్రేయసి సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు

సెక్యుర్ కాదని చెప్పడం లేదు

మరోవైపు పిటిషనర్ల తరఫు వాదించిన లాయర్ జెయిన్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా సెక్యులర్ దేశం కాదని మేము చెప్పడం లేదని.. ఆ సవరణకు మాత్రమే తాము అభ్యంతరం తెలుపుతున్నామని చెప్పారు. అలాగే బీఆర్‌ అంబేద్కర్ కూడా సోషలిజం అనే పదాన్ని చేర్చడం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు  భంగం వాటిల్లుతుందని అభిప్రాయపడ్డారని తెలిపారు.  దీనికి స్పందించిన జస్టీస్ ఖన్నా.. సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని, దేశ సంపదను అందరికీ సమానంగా పంచాలనే అర్థం కూడా వస్తుందని.. దీన్ని పశ్చాత్య పదంగా పరిగణించవద్దని స్పష్టం చేశారు.  

1949 నవంబర్ 26న రాజ్యంగాన్ని తీసుకొచ్చినప్పుడు దాని పీఠికలో కచ్చితమైన ప్రకటన ఉందని.. ఆ తర్వాత చేర్చిన సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలు ఏకపక్షమేనని పిటిషనర్‌ తరఫు న్యాయవాది జయిన్ వాదించారు. దీనికి స్పందించిన జస్టిస్ ఖన్నా.. 1976 రాజ్యాంగ సవరణలో ప్రవేశపెట్టిన పదాలను బ్రాకెట్లతో స్పష్టంగా సూచించారని చెప్పారు.  ఈ సవరణ ద్వారా దేశ ఐక్యత, సమగ్రత అనే పదాలను కూడా చేర్చారని పేర్కొన్నారు. మరోవైపు ఈ అశంపై మరింత పరిశీలన చేసేందుకు కూడా ధర్మానసం అంగీకరించింది. విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు