/rtv/media/media_files/2025/08/17/vivek-2025-08-17-07-40-28.jpg)
పశ్చిమ బెంగాల్ లో జనాభా మార్పులపై బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన కామెంట్స్ చేశారు. బెంగాల్ ను ఆయన న్యూ కశ్మీర్ గా అభివర్ణించారు. నకిలీ పత్రాలతో వస్తున్న అక్రమ వలసదారులకు ఇక్కడి ప్రభుత్వ అధికారులు ఆశ్రయం కల్పిస్తుందన్నారు. 1946 హత్యలను ఉటంకిస్తూ ఆయన తీసిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ లాంచ్‌కు కోల్‌కతాలో అంతరాయం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని రెండుసార్లు ప్రదర్శనను నిలిపివేశారు. దీంతో వాక్ స్వాతంత్య్రాన్ని అణచివేస్తున్నారని ఆరోపిస్తూ అగ్నిహోత్రి అధికారులతో వాదించారు. కొంతమంది రాజకీయ ఒత్తిడితో ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. అయితే ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ లాంఛ్ పై డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని పోలీసులు అంటున్నారు. అనుమతి లేకుండా ట్రైలర్‌ను ప్రదర్శించడానికి ప్రయత్నించడం పశ్చిమ బెంగాల్ సినిమాస్ చట్టం, 1954లోని సెక్షన్ 3ని ఉల్లంఘించడమేనని అన్నారు. ఒకవేళ ఆయన అనుమతి తీసుకుంటే, కనీసం మీడియాకు పత్రాలను చూపించాలని పోలీసులు డిమాండ్ చేశారు.
VIDEO | Reacting to movie director Vivek Agnihotri's allegation that the West Bengal government stopped the trailer launch of his upcoming movie 'The Bengal Files' and his charge of 'total dictatorship', TMC leader Kunal Ghosh says, "What the video maker has said is totally… pic.twitter.com/Zak43uCG9A
— Press Trust of India (@PTI_News) August 16, 2025
ముందు గుజరాత్ ఫైల్స్ తీయ్
అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి కునాల్ ఘోష్ ఈ ఘటనపై మాట్లాడుతూ అగ్నిహోత్రి ఆరోపణలు నిరాధారమని అన్నారు. అతనికి ధైర్యం ఉంటే, మొదట గోద్రా అల్లర్లపై గుజరాత్ ఫైల్స్ చేయాలని, ఆ తరువాత మణిపూర్‌కు వెళ్లి మణిపూర్ ఫైల్స్ చేయాలని డిమాండ్ చేశారు.యూపీకి వెళ్లి యూపీ ఫైల్స్ చేయాలన్నారు. ఇంతకుముందు కశ్మీర్ ఫైల్స్ చేసిన డైరెక్టర్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ను కించపరుస్తూ వాస్తవాలను వక్రీకరిస్తున్నాడని మండిపడ్డారు. బీజేపీ అప్పగించిన తన పనిని అతను చేస్తున్నాడని ఆరోపించారు. కాగా ది బెంగాల్ ఫైల్స్ చిత్రంలో అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, మిథున్ చక్రవర్తి, శాశ్వత ఛటర్జీ తదితరులు నటించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రం 1946 నాటి గ్రేట్ కలకత్తా హత్యలు, బెంగాల్ విభజన సమయంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా ట్రైలర్ లో వెస్ట్ బెంగాల్ లో రెండు రాజ్యాంగాలు నడుస్తున్నాయి, ఒకటి హిందువులకు, మరొకటి ముస్లింలకు వంటి వివాదాస్పద సంభాషణలు వివాదాస్పదంగా మారాయి.
Also read : Udaya Bhanu : రెమ్యూనరేషన్ అడిగితే బ్యాడ్ గా ప్రచారం చేశారు.. ఉదయభాను సంచలన కామెంట్స్