తాను యాంకర్ గా పనిచేసిన సమయంలో చాలామంది రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఎగొట్టారని ఉదయభాను ఆరోపించారు. తాజాగా ఆమె నటిస్తోన్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్. ఈ సినిమాలో ఆమె ఒక అగ్రెసివ్ రోల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మహాభారతంలోని భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ కథను డ్రగ్స్ మాఫియా కోణంలో ఆధునిక నేపథ్యానికి అనుగుణంగా రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది, ఇది సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఉదయభాను కీలక కామెంట్స్
మూవీ ప్రమెషన్ లో భాగంగా.. సత్యరాజ్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉదయభాను కీలక కామెంట్స్ చేశారు. తాను యాంకర్‌గా చేసిన సమయంలో తన రెమ్యునరేషన్ గురించి ఆమె మాట్లాడుతూ... వివిధ షోలకు యాంకర్‌గా చేసిన చెక్‌లు బౌన్స్ అవ్వగా, ఇప్పటికీ అవి తన దగ్గర ఉన్నట్లుగా ఆమె వెల్లడించారు. వాటితో ఇంటికి తోరణాలు కట్టవచ్చంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఆ డబ్బుల గురించి కాస్త గట్టిగా అడిగితే ఉదయభాను పీడించి గోల చేస్తుందంటూ బయట నీచంగా ప్రచారం చేసేవారని వాపోయింది. టీవీ షోల కన్నా కూడా బయట ఈవెంట్స్‌కు వెళ్లినప్పుడే తనకు సరిగా డబ్బులు వచ్చేవని చెప్పుకొచ్చింది. వాటితోనే జీవితంలో నిలదొక్కుకున్నట్లుగా ఆమె తెలిపింది.
యాంకరింగ్ రంగంలో సిండికేట్
అంతకు ముందు కూడా ఉదయభాను యాంకరింగ్ రంగంపై కీలక కామెంట్స్ చేశారు. యాంకరింగ్ రంగంలో సిండికేట్ ఉందని ఆరోపించారు. తనకు అవకాశాలు రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని పరోక్షంగా తెలిపారు. తనకు వచ్చిన అవకాశాలు చివరి నిమిషంలో మరొకరికి వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను హయ్యెస్ట్ పెయిడ్ యాంకర్ అని పేరు ఉన్నప్పటికీ, తనకు రావాల్సిన రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తన చెక్కులు చాలాసార్లు బౌన్స్ అయ్యాయని చెప్పారు. తాను ఎవరినీ కించపరచడానికి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, భవిష్యత్ తరాల యాంకర్లకు అవగాహన కల్పించడానికే ఈ విషయాలను బహిర్గతం చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను ఒక పుస్తకం రాస్తున్నానని, దాని ద్వారా తనకు పరిశ్రమలో ఎదురైన అన్యాయాలను, చేదు అనుభవాలను బయటపెడతానని ఉదయభాను తెలిపారు.
రెమ్యునరేషన్ వదులుకున్నా
ఇక నటుడు సత్యరాజ్ తన రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ సినిమా కథ, బడ్జెట్‌ను బట్టి ఉంటాయని తన రెమ్యునరేషన్ మారుతూ ఉంటుందన్నారు. తాను సినిమా ఫీల్డ్‌కు వచ్చి 47ఏళ్లు అయిందని తొలినాళ్లలో విలన్‌గా 75 సినిమాలు చేశానన్నారు. 100కు పైగా చిత్రాల్లో హీరోగానూ చేశానని, చాలా సమయాల్లో రెమ్యునరేషన్ వదులుకున్నానని తెలిపారు. మరీ ముఖ్యంగా హీరోగా చేసినప్పుడు ఆ సినిమాల విడుదల కోసం అప్పులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. నటించడం కన్నా దర్శకత్వం చేయడం చాలా కష్టం. అనేక విషయాలను ఒకే సారి చూసుకోవాలని అన్నారు.
Udaya Bhanu : రెమ్యూనరేషన్ అడిగితే బ్యాడ్ గా ప్రచారం చేశారు.. ఉదయభాను సంచలన కామెంట్స్
తాను యాంకర్ గా పనిచేసిన సమయంలో చాలామంది రెమ్యూనరేషన్ ఇవ్వకుండా ఎగొట్టారని ఉదయభాను ఆరోపించారు. తాజాగా ఆమె నటిస్తోన్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్. ఈ సినిమాలో ఆమె ఒక అగ్రెసివ్ రోల్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది