PM Modi: ఆట అయినా...యుద్ధమైనా...విజయం మనదే..ప్రధాని మోదీ

ఆసియా కప్ 2025లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. అది కూడా పాకిస్తాన్ మీద. దీనిపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్కడైనా విజయమం మనదే అంటూ ఆటగాళ్ళకు అభినందించారు.

New Update
Modi

Modi

ఆసియా కప్ లో ఒదటి నుంచి చివర వరకూ మనవాళ్ళు అదరగొట్టేశారు. ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా..ఫైనల్ లో దాయాది మీద కూడా గెలిచి తమ సత్తా మరోసారి నిరూపించుకున్నారు. శర్మ కాకపోతే వర్మ ఉన్నాడంటూ విజృంభించేశారు.  ఉత్కంఘంగా జరిగిన ఫైనల్ పోరులో 5 వికెట్ల తేడాతో గగెలిచి భారత్ కు మరో మరుపురాని విజయాన్నిందించారు.  దీంతో దేశం మొత్తం ఆనందంలో నిండిపోయింది. పహల్గాం దాడి పాకిస్తాన్ తో మొదటిసారి ఆడారు. 

పాకిస్తాన్ తో ఆడిన మూడు మ్యాచ్ లలో టీమ్ ఇండియానే విజయం సాధించారు.  ప్రతీ మ్యాచ్ ను పహల్గాందాడి బాధితులకు అంకితమిచ్చారు. ఏ మ్యాచ్ లోనూ భారత ప్లేయర్లు పాక్ ప్లేయర్లతో మాట్లాడలేదు.  కనీసం షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా తమ వ్యతిరేకతను తెలిపారు. ఐసీసీ రూల్స్ ప్రకారం మ్యాచ్ ఆడామే తప్ప ఇష్టపూర్తిగా కాదనే సందేశాన్ని అడుగడుగునా తెలిపారు. పాకిస్తాన్ టీమ్, వాళ్ళ బోర్డు ఎంత గోల చేసినా పట్టించుకోలేదు. మీరు అరుచుకోండి..మేము రెచ్చిపోతాం అంటూ దుళ్ళగొట్టారు. 

ఎక్కడైనా విజయం మనదే..

ఫైనల్ మ్యాచ్ గెలిచన తరువాత భాత ప్రధాని మోదీ భారత ఆటగాళ్ళకు అభినందనలు తెలిపారు.  యుద్ధభూమిలో అయినా, మైదానంలో అయినా ఒక్కటే ఫలితం అని అన్నారు.  క్రికెట్ గ్రౌండ్ లోనూ ఆపరేషన్ సింధూర్ జరిగిందని..అందులో కూడా ఇండియా గెలిచిందని ఆనంతం వ్యక్తం చేశారు. 

కశ్మీర్ లోని పహల్గాంలో ఈ ఏడాది 22న 26 మంది భారత పౌరులను పాక్ ఉగ్రవాదులు అన్యాయంగా చంపేశారు.  దీంతో ఆగ్రహం చెందిన భారత్ మే 7 నుంచి 10 వరకు పాలుగు రోజుల పాటూ  పాక్ లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్ తో విరుచుకుపడింది. దీని తరువాత పాక్ యుద్ధం చేసింది.  వాటిని మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది.  ఆదేశానికి చెందిన పలు వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది.  

Advertisment
తాజా కథనాలు