త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శిస్తా: కేంద్ర జలశక్తి మంత్రి

పోలవరం ప్రాజెక్ట్‌‌ను 2027కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పటేల్ తెలిపారు. చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ సందర్శిస్తానని తెలిపారు.

New Update
Cr patil

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ పోలవరం ప్రాజెక్ట్‌‌ను 2027కి పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. ఏపీ సీఎంగా చంద్రబాబు అయినప్పటి నుంచి పోలవరం పనులు తొందరగా జరుగుతున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే రూ.3 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని, ఇంకా రూ.12 వేల కోట్లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని సీఆర్ పటేల్ అన్నారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శిస్తానని కూడా సీఆర్ పటేల్ ఇటీవల తెలిపారు.   

ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్.. దర్శనానికి ప్రత్యేక పోర్టల్

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత..

ఇదిలా ఉండగా మాజీ మంత్రి అంబటి రాయుడు పోలవరం ప్రాజెక్టుపై కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుకు మరోసారి తీవ్ర విఘాతం ఏర్పడిందని అన్నారు. '' పోలవరానికి ఉరి వేస్తున్నారు. సరైన సమయంలో మేము ప్రాజెక్టు పూర్తి చేయలేకపోవడానికి చంద్రబాబు చేసిన తప్పులే కారణమని చెప్పాను. పోలవరాన్ని భ్రష్టు పట్టించి కేవలం బ్యారేజీగా చేసేందుకు కూటమీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజ్ గొప్పదని చంద్రబాబు మోసం చేశారు.

ఇది కూడా చూడండి:  రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. ఎక్కడంటే?

పోలవరాన్ని సర్వనాశనం చేయబోతున్నారు. జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు అసలు కంటే కొసరు ఎక్కువ మాట్లాడారు. 194 టీఎంసీల నిల్వ సామార్థ్యం నిర్మిస్తేనే పూర్తి ఫలితాలు దక్కుతాయి. 41.15 అడుగుల ఎత్తుకే నిర్మించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.

ఇది కూడా చూడండి: నేటి నుంచే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు

పూర్తి అవగాహన లేకుండా రామానాయుడు మాట్లాడుతున్నారు‌. ఏ ప్రాజెక్టు అయినా దశల వారీగానే నిర్మాణం చేస్తారు. ప్రాజెక్టు మాన్యువల్ ప్రకారం పోలవరం కూడా దశల వారీగానే నిర్మాణం చేస్తారు. నాలుగు దశల్లో నిర్మాణం ఖర్చు ఏ దశలో ఎంత అవుతందని కేంద్రం అడిగింది.

ఇది కూడా చూడండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు కోర్సులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు