Tejas Fighter Jet: తేజస్ యుద్ధ విమానాల ప్రత్యేకత ఏంటి? నిన్న ప్రమాదానికి కారణాలేంటి?

భారత వాయుసేనకు చెందిన తేజస్ యుద్ధ విమానం నిన్న దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్ చనిపోయారు. తేజస్ యుద్ధ విమానం ఇలా కూలిపోవడం రెండో సారి. కారణాలేంటి? అలసు తేజస్ ఫైటర్ జెట్ ప్రత్యేకతలు ఏంటి?

New Update
tejas

తేజస్..భారత్ సొంతంగా తయారు చేసుకున్న తేలికపాటి యుద్ధ విమానాలు. ఇటీవల కాలంలో మిగ్-21 విమానాలను తొలగించిన తరువాత తేజస్‌ను IAF తమ తదుపరి ప్రధాన యుద్ధ విమానంగా భావిస్తోంది. దీనికి IAFలో అత్యుత్తమ భద్రతా రికార్డు ఉంది. 2015 నుంచి ీ విమమానాలను భారత వాయుసేన వాడుతోంది. Mk1A వెర్షన్‌ అభివృద్ధి, అధునాతన ఎలక్ట్రానిక్స్‌, రాడార్‌, ఆయుధ వ్యవస్థలతో మరింత శక్తివంతంగా వీటిని తయారు చేశారు. 4.5 జనరేషన్‌, మల్టీ-రోల్‌ ఫైటర్‌ జెట్‌ తో పాటూ డెల్టా-వింగ్‌, సింగిల్‌ ఇంజిన్‌ కలిగి ఉంటాయి. 4 వేల కిలోల వరకు ఆయుధాలను వాడే సామర్థ్యం ఉంటుంది. భారత్ రూపొందించిన మొదటి ఫైటర్ జెట్ ఇది. నేవీ కోసం కూడా ఇందులో ప్రత్యేక వెర్షన్ ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఇవి వరుసగా ప్రమాదాలకు లోనైయ్యాయి. 24 ఏళ్ళల్లో ఇప్పుడు జరిగింది రెండో ప్రమాదమై అయినప్పటికీ...ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీనిని సీరియస్ గా తీసుకుంది. విమానం కూలిపోవడంపై విచారణ ప్రారంభించింది. దుబాయ్ ఎయిర్ షోలో నిన్న విన్యాసాలను ముగించుకుని కిందకు దిరుగుతున్న తేజస్ సడెన్ గా కుప్పకూలిపోయింది. ఇందులో పైలెట్ మృతి చెందారు. అయితే ఈ ప్రమాదంపై విమానయాన రంగం నిపుణులు ప్రాథమిక అంచనా వేశారు. కూలినప్పుడు వీడియోలను బట్టి తేజస్ నేలను ఢీకొట్టడానికి ముందు నెగటివ్ G టర్న్ విన్యాసం చేస్తోందని...అందులో అదుపు తప్పడం వల్లనే కూలిపోయిందని అంచనా వేశారు.

నెగటివ్ G అంటే?

ఎయిర్ షోలలో విమానాలతో అనే విన్యాసాలు చేస్తుంటారు. వీటి తర్వాత వాటిని సాధారణ స్థితికి తీసుకురావాల్సి ఉంటుంది. నెగటి ఫోర్స్ నుంచి సమతల స్థితికి తీసుకురావాల్సి ఉంటుంది. సాధారణంగా లూప్ విన్యాసం చేశాకనే ఇలాంటివి చేయాలి. ఆ టైమ్ లోనే తేజస్ అకస్మాత్తుగా నేలకూలి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. నెగిటవ్ G అంటే భూమి గురుత్వాకర్షణకు వ్యతిరేక దిశలో విమానంపై , అందులో ఉండే వస్తువులు, మనుషులపై పని చేసే ఫోర్స్. విన్యాసాలు చేసేటప్పుడు, అకస్మాత్తుగా కిందకు దిగేటప్పుడు...గాలిలో అలజడిని, వేగాన్ని తట్టుకోవాలి. అలాంటప్పుడు ఈ ఫోర్స్ ప్రబావం ఉంటుంది. దీని ఫలితంగా పైలెట్, వస్తువుల బరువు తగ్గుతాయి. ఫలితంగా వారు పైకి తేలిపోతారు. పైలెట్ సీటులో నుంచి పైకి నెట్టివేయబడతారు. అలాంటప్పుడు విమానయానంలో లిఫ్ట్ బలం పైకి పనిచేస్తుంది. కానీ ‘నెగెటివ్G’ విన్యాసాల్లో కిందికి పనిచేస్తుంది. అందువల్ల, విమానం కిందికి వెళ్లకుండా దాన్ని పైకి నిలబెట్టడానికి పైలట్ ప్రయత్నిస్తారు. కానీ ఈ నెగటివ్ G ఫోర్స్ ను సరిగ్తా నియంత్రించ లేకపోతే పైలెట్ శరీరంలో రక్త ప్రసరణ అంతా తలకు చేరుకుంటుంది. అప్పుడు అతను అయోమయస్థితిలోకి వెళ్ళడం లేదా స్పృహను కోల్పోవడం లాంటి జరగవచ్చును. అలాంటి టైమ్ లో విమానం మీద నియంత్రణ కోల్పోతారు. ఈ బలాల ప్రభావాన్ని నియంత్రించడానికి, తట్టుకోవడానికి పైలట్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. కానీ దుబాయ్ లో జరిగిన ప్రమాదంలో పైలెట్ నియంత్రణ కోల్పోయి ఉంటారనే అంచనా వేస్తున్నారు. తేజస్ విమానాన్ని వేగంగా దిశను మార్చుకునేలా రూపొందించారు. అందువల్ల దాని రూపకల్పన స్వతహాగా అస్థిరంగా ఉంటుంది. దీని కారణంగానే, తీవ్రమైన ‘నెగెటివ్G’ వంటి విన్యాసాల సమయంలో నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. ఈ ప్రమాదానికి కూడా ఇదే కారణం అయి ఉండవచ్చని అంటున్నారు.

Also Read: Second Test: ఈరోజు నుంచే సౌత్ ఆఫ్రికాతో రెండో టెస్ట్..గెలవకపోతే పరువు గంగలోకే..

Advertisment
తాజా కథనాలు