/rtv/media/media_files/2025/07/04/video-of-thin-bihar-building-viral-2025-07-04-14-31-16.jpg)
Video Of Thin Bihar Building Viral
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏదైన వింతగా, కొత్తగా కనిపించే దృశ్యాలు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సన్నగా ఎత్తుగా ఉన్న గోడలాంటి ఇంటి నిర్మాణం వైరలవుతోంది. కాస్త దూరం నుంచి చూస్తే అది గోడలా కనిపిస్తుంది. కానీ దగ్గరికి వెళ్తే అది ఒక ఇల్లు అని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది బిహార్‌లో జరిగినట్లు తెలుస్తోంది.
बिहार के खगड़िया में गजब का अजूबा घर बना दिया है इसमें आदमी कैसे रहेगा 😂 pic.twitter.com/OaYrOnZcwA
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) July 1, 2025
Also Read: కేరళలో నిఫా వైరస్ కలకలం.. మూడు జిల్లాలకు అలెర్ట్
సన్నగా ఉండే ఈ నిర్మాణాన్ని పలు అంతస్తుల్లో నిర్మించారు. ఇందులో మనుషులు ఎలా నివసిస్తారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇది బిహార్ అని ఇక్కడ ఏదైనా సాధ్యమే అంటూ మరొకరు రాసుకొచ్చారు. చైనావాల్ లాగా ఏమైనా కట్టాలని అనుకుంటున్నారా అని మరోకరు అడిగారు. అంతేకాదు గతంలో కూడా బిహార్‌లో ఇలాంటి విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ముజఫర్‌పుర్‌లో కేవలం ఆరు అడుగుల స్థలంలో ఓ వ్యక్తి అయిదంతస్తుల భవనాన్ని నిర్మించాడు.
Also read: 12 గంటల్లో 1,113 మందితో శృంగారం... ఇది వరల్డ్ రికార్డ్ అంట!