Accident: ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి

ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్ జిల్లాలో ఈరోజు సాయంత్రం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మువానీ నుంచి బక్టా వెళ్తున్న కార్ అదుపు తప్పి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8మంది అక్కడక్కడే మృతి చెందారు. 

New Update
uk Accident

Car Accident In Uttarakhand

ఉత్తరాఖండ్ లో ప్రమాదాలు జుగుతూనే ఉంటాయి. మొత్తం లోయలు, గుట్టలతో నిండిన ఆ ప్రాంతంలో ప్రయాణాలు చేయడం ఎప్పుడూ రిస్కే. ఏ మాత్రం అటు ఇటు అయినా కూడా లోయల్లో పడిపోవాల్సిందే. దానికి తోడు కొండచరియలు విరిగ పడుతుంటాయి. వాటి కింద కూడా పడి జనాలు ప్రాణాలు పొగొట్టుకుంటుంటారు. ఈరోజు ఉత్తరాఖండ్ లో ఓ వాహనం ప్రమాదానికి లోనైంది.  మువానీ నుంచి బక్టా వెళ్తున్న ఓ కార్ (టాక్సీ) అదుపు తప్పి సుమారు 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం సోనీ వంతెన సమీపంలో జరిగింది. ఓ టాక్సీలో మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారు. ఈ కార్ అదుపు తప్పి లోయలో పడిపోవడంతో అక్కడికక్కడే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రమాదంపై దర్యాప్తు..

ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే జిల్లా పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ చేసి గాయపడిన వారిని లోయలో నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వాహనం అదుపు తప్పినదేనన్న అనుమానంతో విచారణ చేస్తున్నారు. ఈ సంఘటన పిథోరాగఢ్ జిల్లా కేంద్రానికి 52 కిలోమీటర్ల దూరంలో మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో చోటు చేసుకుంది. టాక్సీ లోయలో పడిపోయిన వెంటనే ఘటనా స్థలంలో పెద్దేత్తున్న కేకలు వినిపించాయని స్థానికలు చెప్పారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందించారు. ఇందులో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 

Also Read: Google: స్టూడెంట్స్ కు గూగుల్ బంపర్ ఆఫర్..ఫ్రీగా ఏఐ

Advertisment
తాజా కథనాలు