H1B వీసాల ఫీజు పెంపుపై భయమేళ.. భారతీయ ఉద్యోగులకు నో టెన్షన్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం H1B వీసా ఫీజు ఏకంగా లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. భారత ఐటీ సర్వీస్ కంపెనీలపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని దేశీయ పరపతి రేటింగ్ సంస్థ క్రిసిల్ వెల్లడించింది.

New Update
H1B Visa

H1B Visa

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం H1B వీసా ఫీజు ఏకంగా లక్ష డాలర్లకు (సుమారు రూ. 83 లక్షలు) పెంచిన విషయం తెలిసిందే. భారత ఐటీ సర్వీస్ కంపెనీలపై దీని ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని దేశీయ పరపతి రేటింగ్ సంస్థ క్రిసిల్ (Crisil) వెల్లడించింది. ఈ వీసా ఫీజు పెంపు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఐటీ కంపెనీల లాభాలు (ఆపరేటింగ్ మార్జిన్స్) కేవలం 10-20 బేసిస్ పాయింట్లు మాత్రమే తగ్గిస్తుందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ నివేదిక అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీల నిర్వహణ లాభాలు సగటున 22 శాతంగా ఉన్నాయి.

ఖర్చు క్లయింట్లకు బదిలీ చేసే అవకాశం:

ఐటీ కంపెనీలు అదనంగా పెరిగిన వీసా ఖర్చులో 30 నుంచి 70 శాతం వరకు అమెరికాలోని తమ క్లయింట్లకు బదిలీ చేసే అవకాశం ఉందని క్రిసిల్ పేర్కొంది. ఈ వ్యూహం ద్వారా కంపెనీలు ఈ పెంపు భారాన్ని కొంతవరకు తగ్గించుకోగలవు. భారతీయ ఐటీ కంపెనీలు గత కొన్నేళ్లుగాH1B వీసాలపై తమ ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయి. 2018 నుంచే, వీసా దరఖాస్తులు భారీగా రిజక్ట్ అవుతున్నాయి. స్థానిక నియామకాలు, ఆఫ్-షోర్ డెలివరీ కేంద్రాలను పెంచడం వంటి చర్యలు తీసుకోవడంతో ఈ కంపెనీలు వ్యూహాత్మకంగా మారాయి. 2017 నుంచి 2025 మధ్య కాలంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్టెక్నాలజీస్ వంటి నాలుగు అగ్రగామి ఐటీ కంపెనీలకు మంజూరైన H1B వీసాల సంఖ్య దాదాపు సగానికి తగ్గింది.

ఉద్యోగుల మొత్తం ఖర్చుపై ప్రభావం:

ప్రస్తుతం, వీసాలకు సంబంధించిన ఖర్చులు మొత్తం ఉద్యోగుల వ్యయంలో 0.02-0.05 శాతం మాత్రమే ఉన్నాయి. అయితే, కొత్త ఫీజు కారణంగా ఇది సుమారు 1.0 శాతానికి పెరిగే అవకాశం ఉన్నా, కంపెనీలు ఆఫ్-షోరింగ్ మరియు క్లయింట్‌లతో ధరల పునఃసమీక్ష ద్వారా ఈ భారాన్ని సమర్థవంతంగా నిర్వహించగలవని క్రిసిల్ తెలిపింది.

ఈ కొత్త లక్ష డాలర్ల ఫీజు కేవలం కొత్తగా H1B వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే వీసా కలిగి ఉన్నవారికి లేదా రెన్యువల్ చేసుకునేవారికి ఇది వర్తించదు. ఈ పరిమితి కారణంగా కూడా తక్షణ ఆర్థిక ప్రభావం పెద్దగా ఉండదని క్రిసిల్ స్పష్టం చేసింది. అయితే, ఈ పెంపు మధ్య కాలంలో భారతదేశానికి వచ్చే విదేశీ పంపకాలపై (Remittances) స్వల్ప ప్రభావం చూపవచ్చని కూడా నివేదిక హెచ్చరించింది.

Advertisment
తాజా కథనాలు