/rtv/media/media_files/2025/06/11/l5s4yigE189UcK6GB76W.jpg)
UPSC
UPSC Mains Result 2025 : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ (CSE 2025) మెయిన్ ఫలితాలు ఈ రోజు (బుధవారం) విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలు పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారిని మాత్రమే తుది దశ ఇంటర్వ్యూకి పిలుస్తారు. కాగా తాజా ఫలితాల్లో మొత్తం 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్ రౌండ్)లకు ఎంసికైనట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూకి కలిపి వచ్చిన మొత్తం మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. ఫైనల్‌గా వచ్చిన మార్కుల ఆధారంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)తో పాటు ఇతర సెంట్రల్ సర్వీసెస్ అయిన గ్రూప్ ‘ఏ’ గ్రూప్ ‘బి’ వంటి పోస్టులకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
కాగా ఆర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీని త్వరలోనే యూపీఎస్సీ ప్రకటించనుంది. ఈ ఇంటర్వ్యూలు న్యూఢిల్లీ షాజహాన్ రోడ్‌లో ఉన్న ధోల్‌పూర్ హౌస్‌లోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో జరుగుతాయని అధికారులు వెల్లడించారు. పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూలు) షెడ్యూల్ తదనుగుణంగా అందుబాటులో ఉంచుతారు. అభ్యర్థుల పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూలు) ఈ-సమ్మన్ లెటర్లు కూడా తగిన సమయంలో అందుబాటులో ఉంచుతారు, వీటిని కమిషన్ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది మొత్తం 979 పోస్టులను కమిషన్ ఎంపిక చేయనుండగా. 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వూలకు హాజరుకానున్నారు.
ఫలితాలు 2025 ఇలా చెక్ చేసుకోండి..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాలను తనిఖీ చేయడానికి అభ్యర్థులు తొలుత UPSC అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించాలి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న UPSC సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రిజల్ట్ 2025 లింక్‌పై క్లిక్ చేయాలి.
వెంటనే స్క్రీన్‌పై కొత్త PDF ఫైల్ వస్తుంది. ఇందులో మీ ఫలితాలను తనిఖీ చేసి పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
భవిష్యత్తు అవసరాల కోసం దాని హార్డ్ కాపీని భద్రపరచుకోవచ్చు.
ఇది కూడా చూడండి: Maoist Partys Ceasefire: కాల్పుల విరమణ ఊహించని పరిణామం..మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
Follow Us