అమెరికా అగ్నికి ఆజ్యం పోస్తోంది. అసలే భారత్, యూఎస్ మధ్య వాణిజ్య పరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఈ టైమ్ లో సంయమనంతో వ్యవహరించకుండా మరింత రెచ్చగొట్టే పనులు చేస్తోంది. తాజాగా అమెరికాకు పాక్ అధికారుల పర్యటనలు ఎక్కువైయ్యాయి. దీనిపైనే ఇండియా మండిపడుతోంది. తమ శత్రుదేశంతో అమెరికా చేతులు కలపడం, తమను దూరం చేసుకోవడం మంచిది కాదని అంటోంది. దీనికి తోడు తాజాగా పాక్ పై ప్రశంసలు కురింపించింది అమెరికా.ఉగ్రవాద సంస్థలను అణిచి వేయడంలో పాకిస్తాన్ విజయం సాధించింది అంటూ యూఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. పాక్‌లో ఇటీవల ఉగ్ర దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేసింది.
ఉగ్రవాదాన్ని సమర్థంగా అణిచింది..
ఈరోజు ఇస్లామాబాద్ లో అమెరికా, పాక్ ప్రతినిధులు ఉగ్రవాద వ్యతిరేక పూరుపై చర్చలు జరిపారు. ఇందులో ఇరు దేశాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. దానిలోనే పాక్ పై పొగడ్తల వర్షం కురిపించింది అమెరికా. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, ఐఎస్‌ఐఎస్-ఖోరాసన్, తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ లాంటి ఉగ్రవాద సంస్థల నుంచి ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు సమర్థ వ్యూహాలపై ఇరు దేశాలు చర్చించినట్లు తెలుస్తోంది. దీనికన్నా ఒక రోజు ముందే అమెరికా బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, దాని అనుబంధ సంస్థ మాజిద్ బ్రిగేడ్‌లను అంతర్జాతీయ ఉగ్రసంస్థలుగా ప్రకటించింది.
మరి భారత్ సంగతేంటి?
మరోవైపు కొన్ని రోజుల క్రితమే లష్కరే తొయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది యూఎస్. మరోవైపు ఇప్పటికే పాక్ కు ఉగ్రవాదంతో సంబంధం ఉందని..పహల్గాం దాడితో కూడా సంబంధం ఉందని భారత్ నిరూపించింది. దానిని అమెరికా కూడా ఒప్పుకుంది. ఇప్పుడేమో అదే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థవంతంగా అణిచిందని అంటోంది. అమెరికా నుంచి వచ్చిన ఈ ప్రకటన ఆందోళనలో పడేస్తోంది. ప్రస్తుతం భారత్ తో పరిస్థితులు సరిగ్గా లేని సమయంలో ఇలా ప్రవర్తించడం మరింత ఉద్రిక్తతలకు దారి తీస్తుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా..భారత్ తో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి సిద్ధమయ్యిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ అమెరికా మాత్రం పైకి అదేం లేదు అని నాటకాలాడుతోంది. రత్, పాకిస్తాన్ సంబంధాల్లో ఎటువంటి మార్పు లేదని...ఎప్పటిలానే మంచి సంబంధాలు కొనసాగుతాయని చెబుతోంది. కానీ వెనుక నుంచి పాకిస్తాన్ తో చేతులు కలుపుతోంది. దీనికి తోడు పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ యూఎస్ తో కలిసి అణ్వాయుధాలు ప్రయోగిస్తామని బెదిరిస్తున్నారు.
Also Read: PM Modi: ముందు చైనా..తరువాత అమెరికా ..టారీఫ్ లపై పక్కా ప్లాన్ తో భారత ప్రధాని మోదీ
US-PAK: భారత్ ను రెచ్చగొడుతున్న అమెరికా..ఉగ్రవాదాన్ని అణిచిందంటూ పాక్ పై ప్రశంసలు
అమెరికా ఉద్దేశం ఏంటో ఎవరికీ అంతపట్టడం లేదు..ఒకవైపు భారత్ తో గొడవ పడుతోంది. మరోవైపు పాక్ ను పొగుడుతోంది. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో పాకిస్తాన్ విజయం సాధించింది అంటూ ప్రశంసలు కురిపిస్తోంది.
USA-Pakistan