ఘోర విషాదం.. కుప్పకూలిన బుల్లెట్ రైలు బ్రిడ్జి, ఎంత మంది మరణించారంటే?

గుజరాత్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు కార్మికులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారు, చనిపోయిన వారి సంఖ్య ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.

New Update
Bullet Train Bridge Collapses

గుజరాత్‌లో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో ఘోర ప్రమాదం జరిగింది. ఆనంద్ జిల్లా వసాద్ ప్రాంతంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణంలో ఉండగానే కొంత భాగం కూలిపోయింది. అదే సమయంలో చాలా మంది కార్మికులు అక్కడ పనిచేస్తుండటంతో బ్రిడ్జి శిథిలాల కింద చిక్కుకుని మృత్యువాత పడ్డారు. మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

Also Read :  హీరో విజయ్ దేవరకొండకు ప్రమాదం.. VD12 షూటింగ్ లో అలా..!

మృత్యువాత పడ్డ కార్మికులు

అందిన సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. వెంటనే సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలో ఉన్న హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Also Read :  అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

కాగా దేశంలోని తొలి బుల్లెట్ ట్రైన్ నడిచే అహ్మదాబాద్-ముంబై లైన్‌లో ఈ ఘోరమైన ప్రమాదం జరిగింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది, ఇతర అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో శిథిలాల కింద ఇరుక్కుపోయిన కార్మికులను బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read :  క్షమాపణ చెప్పాకే రావాలి.. రాహుల్: KTR 

అధికారులతో పాటు స్థానికులు సైతం వారికి సహాయం చేస్తున్నారు. కాగా అహ్మదాబాద్ నుంచి ముంబై వరకు దేశంలోని మొదటి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ బుల్లెట్ ట్రైన్ లైన్ 2026 నాటికి అందుబాటులోకి వస్తుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎన్నో సార్లు తెలిపింది. కానీ ఈ నేపథ్యంలోనే ఘోరమైన విషాదం జరగడంతో ఈ నిర్మాణానికి కొద్ది రోజులు బ్రేక్ ఇస్తారని కొందరు చర్చించుకుంటున్నారు.

ALSO READ: అంబటి రాంబాబుపై చర్యలు.. టీడీపీ సంచలన ట్వీట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు