/rtv/media/media_files/2025/01/19/lktP2AFsxzriqADdaV4I.jpg)
UGC NET Exam
యూజీసీ- నెట్ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదలయయ్యాయి. అడ్మిట్ కార్డుల కోసం ugcnetdec2024.ntaonline.in ఇక్కడ క్లిక్ చేయండి. . 85 సబ్జెక్టులకు 3 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో సీబీటీ పరీక్షలు పూర్తి కావాల్సి ఉండగా.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 15న జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది. అయితే ఆ పరీక్షను జనవరి 21, 27 తేదీలకు రీషెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ రెండ్రోజుల్లో జరగనున్న అడ్మట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Also Read: ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు విందులో పాల్గొన్న ముఖేశ్ అంబానీ దంపతులు
అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేయడంలో ఏవైనా ఇబ్బందులు వస్తే అభ్యర్థులు 011-40759000 నంబర్‌కి కాల్ చేసి చెప్పొచ్చు. లేదా [email protected] ద్వారా సంప్రదించవచ్చు. ఇదిలాఉండగా.. జూనియర్ రీసెర్చి ఫెలోషిప్, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడపడే నెట్ పరీక్ష కోసం డిసెంబర్ 11 వరకు అప్లికేషన్లు స్వీకరించిన సంగతి తెలిసిందే.
Also Read: కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ప్రాణ భయంతో భక్తుల పరుగులు!