Uber: షికారా పేరుతో ఊబెర్ కొత్త సేవలు..

కార్లోనే కాదు ఇప్పుడు ఊబెర్ బుక్ చేసుకుంటే...ఎంచక్కా బోట్‌లో కూడా షికారు చేయవచ్చును. ఎలా, ఎక్కడ అని ఆలోచిస్తున్నారా...కాశ్మీర్‌‌లో దాల్‌ లేక్‌లో బోట్ల గురించి ఇదంతా. అక్కడ లేక్‌లో విహరించాలంటే ఇక మీదట హాయిగా ఊబెర్ బుక్ చేసుకుని వెళ్ళిపోవడమే. 

New Update
uber

కారు బుక్ చేసుకున్నట్టు...పడ కూడా బుక్ చేసుకుంటే భలే ఉంటుంది కదా. మీ పడవ బుక్ అయింది. ఫలానా ప్లేస్‌లో ఎక్కడ అంటుంటే...సరదాగా ఉంది కదా. తాజాగా ఈ సౌకర్యానికి ఏర్పాట్లు చేసింది ఊబెర్. కాశ్మీర్‌‌లోని శ్రీనగర్‌‌లో దాల్ లేక్ ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. అక్కడకు వెళ్ళిన వాళ్ళు ఎవరూ బోట్ షికారు చేయకుండా వెనక్కు రారు. ఇప్పుడు అదే దాల్ లేక్‌లో ఊబెర్ సహాయంతో పడవలను బుక్ చేసుకోవచ్చును. దీంతో  కాశ్మీర్‌ను సందర్శించబోతున్నారంటే మన సరదా రెట్టింపు కాబోతుంది. భారతదేశంలోనే కాకుండా మొత్తం ఆసియాలోనే తొలిసారిగా ఇలాంటి సర్వీస్‌ను ప్రారంభించినట్లు ఉబెర్ ప్రకటించింది. దీనికి షికారా అని పేరు పెట్టింది. ఇక నుంచి శ్రీనగర్‌ను సందర్శించే పర్యాటకులు ఇక్కడ టాక్సీని బుక్ చేసుకోవడంతోపాటు షికారాకు ట్రిప్‌ను బుక్ చేసుకోవచ్చ ఎంచక్కా.

Also Read : బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

షికారా బోట్ క్యాబ్..

సంప్రదాయం, సాంకేతికతల మేలు కలయికే షికారా అని చెబుతున్నారు ఊబెర్ కంపెనీ దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభజీత్ సింగ్.  క్యాబ్ ఎలా అయితే సులభంగా బుక్ చేసుకుంటారో...షికారాను కూడా అలాగే ఈజీగా చేసుకోవచ్చని చెప్పారు. కశ్మీర్ టూరిజంను పెంచడానికి ఇది ఎంతో ఉపయోగడుతుందని తెలిపారు. ఆసియాలోనే ఈ తరహా జలరవాణా సర్వీసు ఇదే తొలిసారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఊబెర్ యాప్‌లో షికారా బోట్ ఐకాన్ కనిపిస్తుంది.  ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు షికారా రైడ్‌ను బుక్ చేసుకోవచ్చు. దీని కోసం ఉబెర్ షికారా రైడర్స్ నుండి ఎటువంటి కమీషన్ వసూలు చేయదు. అలాగే రైడ్ మొత్తం కూడా బోట్ యజమానికే వెళతాయి. షికారా రైడ్‌లను ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒకేసారి ఒక గంట పాటు బుక్ చేసుకోవచ్చని ఉబెర్ తెలిపింది. ఈ షికారా దాల్ సరస్సులోని షికారా ఘాట్ నంబర్ 16 నుండి మొదలవుతుంది. ఇందులో ఒకేసారి నలుగురు ప్రయాణించవచ్చు. ఉబర్ షికారా రైడ్‌ను 15 రోజుల నుండి 12 గంటల ముందుగానే బుక్ చేసుకోనే అవకాశాన్ని కల్పించింది ఊబెర్.

Also Read: USA: ఎవరిష్టం వాళ్ళదేనా...బైడెన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ట్రంప్

Also Read: నన్ను అరెస్ట్ చేస్తే జైలుకెళ్లి ఆ పని చేస్తా.. RGV సంచలన కామెంట్స్

Also Read:  కాంగ్రెస్ లోకి హరీష్‌ రావు.. మాజీ సీఎంతో మంతనాలు!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు