USA: ఎవరిష్టం వాళ్ళదేనా...బైడెన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ట్రంప్

తన కుమారుడు హంటర్ బైడెన్‌కు క్షమాభిక్ష ఇవ్వాలని చెప్పిన బైడెన్ నిర్ణయాన్ని అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రప్ తప్పుబట్టారు. ఇది పూర్తిగా న్యాయవిరుద్ధమని..అధికార ఉర్వినియోగం చేశారని మండిపడ్డారు. 

New Update
Donald Trump : 'నేను ఆరేళ్ల పిల్లాడితో పోటీపడుతున్నా'.. ట్రంప్‌పై బైడెన్‌ సెటైర్లు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌కు భారీ ఊరట లభించింది.మరికొద్ది రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి దిగిపోనున్న జో బైడెన్‌ ...తన కుమారుడికి కేసుల నుంచి పూర్తి ఉపశమనం కల్పించారు.అక్రమంగా ఆయుధం కొనుగోలు సహా రెండు క్రిమినల్‌ కేసుల్లో హంటర్‌ కు క్షమాభిక్ష ప్రసాదిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమారుడి పై కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని ఈ సందర్భంగా జో బైడెన్‌ ఆరోపించారు. అమెరికా ప్రజలకు సత్యాన్నే చెప్పాలి..నా జీవితం మొత్తంలో నేను పాటిస్తున్న సూత్రం ఇదే..! న్యాయశాఖ తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోనని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రోజే  చెప్పాను. ఆ మాటకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నా అని అన్నారు. ఒక తండ్రిగా, అధ్యక్షుడిగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నానో అమెరికా ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని బైడన్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

అంతా మీ ఇష్టమేనా?

దీనిపై డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందిస్తూ బైడెన్‌ నిర్ణయం న్యాయ విఘాతం అని అన్నారు. హంటర్‌కు క్షమాభిక్ష ప్రసాదించినట్లే ఏళ్లుగా జైళ్లలో మగ్గుతున్న జే-6 (జనవరి 6న క్యాపిటల్ హిల్‌లో ట్రంప్‌ తరఫున అల్లర్లలో పాల్గొన్నవారు) బందీలకు కూడా క్షమాభిక్ష ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తన కుమారుడిని కేసుల నుంచి తప్పించడం పూర్తిగా న్యాయవిరుద్ధం, అధికార దుర్వినియోగం అని సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు ట్రంప్. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, అధికారంలో ఉన్నాం కదాని ఇలా ఎవరికి కావాల్సిన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే న్యాయం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. 

Also Read: TS: కూరలమ్మే వాళ్ళపై దూసుకెళ్ళిన లారీ..నలుగురు మృతి

క్యాపిటల్ భవనం అల్లర్లు?

2021 జనవరి 26న అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు వాషింగ్టన్‌ క్యాపిటల్‌ భవనంలో కాంగ్రెస్‌ సమావేశమైన సమయంలో ట్రంప్‌ మద్దతుదారులు వేలాదిగా క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు.  వారి దాడిలో 140 మందికి పైగా పోలీసు అధికారులు గాయపడ్డారు. దాడుల్లో పాల్గొన్న 1,500 మందిపై పలు కేసులు నమోదయ్యాయి. దీనికి నాయకత్వం వహించిన ప్రౌడ్ బాయ్స్ నాయకుడు ఎన్రిక్ టిరాయోకు 2 ఏళ్ళ జైలు శిక్ష విధించారు. మరొకరికి 18 ఏళ్ళ కారాగార శిక్ష విధించారు. 

Also Read: RGV: నాకు అసలు అరెస్ట్ వారెంటే ఇవ్వలేదు–రాంగోపాల్ వర్మ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు