/rtv/media/media_files/2025/09/15/puja-khedkar-and-mother-2025-09-15-08-19-47.jpg)
Puja Khedkar & Mother
Puja Khedkar & Mother : తప్పుడు ధ్రువపత్రాల వ్యవహారంలో ఇటీవల ట్రైనీ ఐఏఎస్ ఉద్యోగం కోల్పోయిన పూజా ఖేడ్కర్, ఆమె తల్లి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వారు గతంలోనూ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. పూజ తల్లి తుపాకీ పట్టుకుని దాడి చేస్తున్న వీడియో ఒకటి బయటికి రావడంతో అప్పట్లో తల్లీకూతుళ్లు తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఐరోలిలో ఓ ట్రక్ డ్రైవర్ ను వారు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. నవీ ముంబయిలోని ఓ సిగ్నల్ వద్ద పూజా ఖేడ్కర్ కుటుంబం ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీ కొట్టింది. అయితే ఈ ఘటన తర్వాత ట్రక్కు డ్రైవర్ కన్పించకుండా పోవడం సంచలనంగా మారింది. ప్రమాదం జరిగిన అనంతరం ఇద్దరు వ్యక్తులు ఆ డ్రైవర్‌ను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ దిశగా ఆరా తీయగా.. ఈ డ్రైవర్ పూణేలోని చతుశృంగి ప్రాంతంలోని పూజా ఖేడ్కర్ ఇంట్లో దొరకడం కలకలం రేపింది.
Pune Video: Ex-IAS Probationer Puja Khedkar's Mother Confronts Police During Rescue Of Allegedly Kidnapped Driver From Her Home pic.twitter.com/zYkEsSyi7L
— Momentum News (@kshubhamjourno) September 14, 2025
సామాజిక కార్యకర్త విజయ్ కుంభార్ ఈ కిడ్నాప్‌కు సంబంధించి ట్వీట్ చేయడంతో పాటు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విజయ్ కుంభార్ తన పోస్ట్‌లో "వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తల్లి చేసిన మరో దారుణం మీ ముందుకు వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 13న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో, ములుండ్ నుంచి ఐరోలి రోడ్డులోని ఐరోలి ప్రాంతంలోని సిగ్నల్ వద్ద ఓ ట్రక్ డ్రైవర్‌ను కిడ్నాప్ అయ్యాడు. బాధితుడు తుర్భే MIDC నవీ ముంబై నివాసి అయిన ప్రహ్లాద్ కుమార్ (22). ప్రహ్లాద్ కుమార్ తన మిక్సర్ ట్రక్కును తీసుకెళ్తుండగా MH 12RT 5000 నంబర్ ఉన్న కారును మిక్సర్ ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతన్ని బలవంతంగా తమ కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. దీంతో అతడు కనిపించడం లేదని రబాలే పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది' అంటూ ఆయన పోస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.
కాగా డ్రైవర్ కనిపించడం లేదని పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టారు. అందులో భాగంగా అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఖరత్ కారును ట్రాక్ చేయడానికి పూణేకు వెళ్లారు.. అక్కడ చతుశృంగి ప్రాంతంలోని వివాదాస్పద ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ ఇంట్లో సంబంధిత కారు లొకేషన్ కనిపించింది. API ఖరత్, అతని టీం పూజా ఖేడ్కర్ ఇంటికి వెళ్లి కిడ్నాప్ అయిన డ్రైవర్‌ను రక్షించినట్లు విజయ్ కుంభార్ తన ట్వీట్‌లో వివరించారు. దర్యాప్తు సమయంలో పూజా ఖేడ్కర్ తల్లి పోలీసులతో దురుసుగా ప్రవర్తించింది. కనీసం తలుపు కూడా తెరవలేదు. అనంతరం పోలీసులు వారిని రబాలే పోలీస్ స్టేషన్‌కు రావాలని ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు పోలీసులు పూజా ఖేడ్కర్ తల్లి కిడ్నాప్ వ్యవహహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టారు. గతంలోనూ పూజా ఖేడ్కర్ తల్లి బెదిరింపుల వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక ఈ కిడ్నాప్ కేసు పూజా ఖేడ్కర్‌కు మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టనుంది.
ఇది కూడా చదవండి:ఏపీలో దారుణం.. భార్యను రోకలి బండతో హత్య చేసి గొంతు కోసుకున్న భర్త