/rtv/media/media_files/2025/02/02/0NTZtD0Mde3EzlZ4B9JC.jpg)
Minor Girl Assaulted by Police
13 ఏళ్ల బాలిక తన ప్రియుడిని వెతుక్కుంటూ వెళ్లింది. చివరికీ ఆ బాలిక పోలీసుల చేతుల్లోనే లైంగిక దాడికి గురవ్వడం కలకలం రేపింది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనను వివాహం చేసుకుంటానని బాయ్‌ఫ్రెండ్ మాటలు నమ్మిన ఓ బాలిక ఇంటి నుంచి పారిపోయింది. తీరాచూస్తే పోలీసుల చేతికి చిక్కి ఇలా జరిగడం చర్చనీయాంశమవుతోంది.
Also Read: ఢిల్లీలో గెలిచేది ఆ పార్టీయే.. ప్రీపోల్ సర్వేలో సంచలన విషయాలు
ఇక వివరాల్లోకి వెళ్తే.. 13 ఏళ్ల బాలిక తనను పెళ్లి చేసుకుంటానని చెప్పిన బాయ్‌ఫ్రెండ్ మాటలు నమ్మి ఇంట్లో నుంచి పారిపోయింది. అయితే రాత్రి కాడవంతో రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పైనే నిద్రపోయింది. కానీ ఇంతలోని రామన్ అనే ట్రాఫిక్ పోలీసు ఆ బాలిక వద్దకు వచ్చాడు. ఆమెను జీపు ఎక్కించుకున్నాడు. ఆ వాహనంలోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి ట్రాఫిక్ పోలీసుల బూత్‌కు తీసుకెళ్లి మరోసారి లైంగికదాడి చేశాడు. చివరికి ఆ బాలిక రామన్ నుంచి తప్పించుకుంది. ఎలాగోలా ఇంటికి వెళ్లింది.
Also read: కుంభమేళాలో 'అయోధ్య రామ మందిరం'.. తెలుగు వ్యక్తి టాలెంట్ కి ఫిదా అయిన భక్తులు!
వాస్తవానికి తనకు ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారనే కారణంతో ఆ బాలిక ఇంట్లో నుంచి పారిపోయినట్లు తెలిసింది. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమె ఆచూకీని కనిపెట్టారు. బాలికను విచారించగా.. ట్రాఫిక్ పోలీసు రామన్ బాగోతం వెలుగులోకి వచ్చింది. అంతేకాదు బాయ్‌ఫ్రెండ్ కూడా తనపై లైంగికదాడి చేశాడని ఆ బాలిక పోలీసులకు చెప్పింది.
Also Read: కేజ్రీవాల్ విలవిల.. ట్యాక్స్ మినహాయింపు వెనుక మోదీ వ్యూహం ఇదే!
Also Read: పోలీసులపై దాడులు చేసేందుకు మవోయిస్టుల బిగ్ స్కెచ్.. హిడ్మాకు బదులు పతిరాం!