/rtv/media/media_files/2025/08/28/raghu-ram-2025-08-28-08-03-02.jpg)
Former RBI Governor Raghuram Rajan
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 25 వాతం అదనపు సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీనిపై భారత్ ఎన్ని సార్లు చర్చలు జరిపినా అమెరికా వెనక్కు తగ్గలేదు. దీని కారణంగా భారత్ ఎగుమతులు తగ్గనున్నాయి. దాంతో పాటూ వస్త్రాలు లాంటి వాటిపై భారం పడనుంది. వ్యాపారం తగ్గనుంది. భారత్ పై విధించిన సుంకాలపై ఇప్పటికే చాలా మంది స్పందించారు. తాజాగా భారత ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థికవేత్త రఘురామ రాజన్ స్పందించారు. అమెరికా అదనపు సుంకాలు విధించడం చాలా బాధాకరమని అన్నారు.
ఇదో పెద్ద మేల్కొలుపు..
అదనపు సుంకాల పై రఘురామ రాజన్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ టారీఫ్ లు భారత్ కు పెద్ద లెసన్ ను నేర్పిస్తాయని అన్నారు. ఒకే వాణిజ్య భాగస్వామిపై ఆధారపడకుండా నేర్పిస్తుందని అన్నారు. ఏ దేశానికైనా ఒకరితో కన్నా పలు దేశాలతో వాణిజ్య లావాదేవీలు ఉండడం మంచిదని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచం చాలా మారిపోయిందని..వాణిజ్యం, పెట్టుబడి, ఆర్థిక పరిస్థితులే ఆయుధంగా మారుతున్నాయని ఆయన అన్నారు. భారత్ ఇక మీదట అయినా జాగ్రత్తగా నడుచుకోవాలని సూచించారు. భారత్ ఇక మీదట యూరప్, చైనా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లాంటి దేశాలతో కలసి ముందుకు నడవాలని చెప్పారు. దాంతో పాటూ దేశంలో యువతకు ఉపాధి కల్పించడానికి అవసరమైన 8–8.5% వృద్ధిని సాధించడంలో మనకు సహాయపడే సంస్కరణలను ప్రారంభించాలని ప్రభుత్వానికి రఘురామ రాజన్ సూచించారు.
వాణిజ్యాన్ని విస్తరించాలి..
రష్యా చమురు దిగుమతులపై భారతదేశం తన విధానాన్ని పునఃపరిశీలించుకోవాలని రాజన్ సూచించారు . ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది బేరీజు వేసుకోవాలి. శుద్ధి కర్మాగారాలు అదనపు లాభాలను ఆర్జిస్తున్నాయి. కానీ ఎగుమతిదారులు సుంకాల ద్వారా ధర చెల్లిస్తున్నారు. ప్రయోజనం పెద్దగా లేకపోతే, మనం ఈ కొనుగోళ్లను కొనసాగించాలా వద్దా అని ఆలోచించడం విలువైనదని ఆయన అన్నారు. అయితే ఇక్కడ సమస్య న్యాయబద్ధత కాదని..భౌగోళిక రాజకీయమని చెప్పారు. మన సరఫరా వనరులను మరియు ఎగుమతి మార్కెట్లను మనం వైవిధ్యపరచాలి రాజన్ చెప్పారు. అన్ని దేశాలతో కలిసి పని చేయడం కానీ ఎవరి మీదా ఆధారపడకండి అంటూ సలహా ఇచ్చారు.
అదనపు సుంకాలు.. అమెరికా-భారత్ సంబంధాలకు "దెబ్బ" అని అభివర్ణిస్తూ.. ఈ చర్య ముఖ్యంగా రొయ్యల రైతులు, వస్త్ర తయారీదారులు వంటి చిన్న ఎగుమతిదారులను దెబ్బతీస్తుందని, జీవనోపాధిని ప్రమాదంలో పడేస్తుందని రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. సడెన్ గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లో ఛేంజ్ కనిపించింది. రష్యా, భారత్, ఇతర దేశాలతో జరుగుతున్న చర్చల్లో ఏదో మార్పు వచ్చింది. భారత్ తాను చెప్పే నియమాల ప్రకారం నడుచుకోవడం లేదని ట్రంప్ అనుకున్నారు. దానిని ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం ఉందని నిర్ణయించుకున్నారు. అందుకే అదనపు సుంకాలను అమలు చేశారు. ఏది ఏమైనా భారత్ ఇప్పుడు మరింత తెలివిగా ఆధలోచించి అడుగులు వేయాల్సి సమయం ఆసన్నమైందని రాజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read: Chat GPT: లంబోర్గిని కారు చోరీ..కనిపెట్టిన చాట్ జీపీటీ