Tomato Virus: టమోటా వైరస్‌ కలకలం.. చిన్నారుల్లో పెరుగుతున్న వ్యాప్తి

మధ్యప్రదేశ్‌లో టమోటా వైరస్ విజృంభిస్తోంది. రాజధాని భోపాల్‌లోని చిన్నారుల్లో ఇది వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ సోకిన వాళ్లలో చేతులు, అరికాళ్లు, పాదాలు, నోటిలో, మెడ కింద ఎర్రటి దద్దుర్లు కనిపిస్తున్నాయి.

New Update
Tomato Virus

Tomato Virus

మధ్యప్రదేశ్‌లో టమోటా వైరస్ విజృంభిస్తోంది. రాజధాని భోపాల్‌లోని చిన్నారుల్లో ఇది వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ సోకిన వాళ్లలో చేతులు, అరికాళ్లు, పాదాలు, నోటిలో, మెడ కింద ఎర్రటి దద్దుర్లు కనిపిస్తున్నాయి. అనంతరం ఇవి బొబ్బలుగా కూడా మారుతున్నాయి. అలాగే దురద, మంట, గొంతునొప్పి, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ వ్యాపిస్తోంది. ఈ లక్షణాలతో బాధపడే చిన్నారులను ఇంటికే పరిమితమైపోయారు. పాఠశాల యాజమాన్యాలు కూడా ఈ వైరస్ సోకిన పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని సూచిస్తున్నాయి.  

Also Read: పండుగ పూట విషాదం.. ముగ్గురు యువకులు సజీవదహనం

ఈ వైరస్ గురించి పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ రాజేశ్‌ టిక్కాస్ మాట్లాడారు. ఈ టమోటా వైరస్‌ను హ్యాండ్‌, ఫూట్‌, మౌత్ డిసీజ్(HFMD) అంటారని తెలిపారు. ఎచినోకాకస్, కాక్స్‌సాకీ వైరల్ వల్ల ఇది వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. HFMD అనేది మాములు సమస్యేనని తల్లిదండ్రులు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వారం, పది రోజుల్లో అదే తగ్గిపోతుందని చెప్పారు. మల విసర్జన తర్వాత చిన్నారులు సరిగ్గా చేతులు కడుక్కోకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం వల్లే ఈ వైరస్ వ్యాపిస్తుందని వెల్లడించారు. 

Also Read: 200 ఏళ్ళ నాటి శాపం.. ఆ ప్రాంతంలో చీరలు కట్టుకొని పురుషుల నృత్యాలు!

ఈ వైరస్ సోకినవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల నుంచి ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలిపారు. లాలాజలం లాంటి శరీర స్రావాలతో కూడా సోకుతుందని తెలిపారు. ఈ వైరస్ వచ్చిన 3 నుంచి 6 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఈ వ్యాధికి ఇప్పటివరకు ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదని చెప్పారు. పరిశుభ్రత పాటించడం ముఖ్యమని సూచనలు చేశారు. 

Also Read: ఆపిల్ ఐఫోన్, ఐపాడ్ కోసం కిడ్నీ అమ్మేశాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

Advertisment
తాజా కథనాలు