/rtv/media/media_files/2025/07/11/tying-lovers-to-the-plow-2025-07-11-19-41-47.jpg)
Tying lovers to the plow
Love Couple : వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ వారి కుటుంబ సభ్యులు మాత్రం ఆ పెళ్లిని అంగీకరించలేదు. వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. గ్రామ కట్టుబాట్లను కాదని పెళ్లి చేసుకున్నారని ఆరోపిస్తూ వారిని నాగలికి ఎద్దుల్లా కట్టి చిత్రహింసలు పెట్టారు. ఈ అమానుష ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల ప్రకారం...
Also Read:చెడు కలలతో టార్చర్‌గా ఉందా..? ఈ పని చేయడం మానేస్తే చాలా..!!
ఒడిశా లోని రాయగడ జిల్లా కంజమజ్హిరా గ్రామానికి చెందిన ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమ గ్రామ ఆచారాలకు విరుద్ధంగా ఉందని వారి నిర్ణయాన్ని గ్రామ పెద్దలు అంగీకరించలేదు. నిజానికి వారిద్దరూ బంధువులు అయినప్పటికీ పెళ్లికి మాత్రం వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారిని శిక్షించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. అ నెపంతో పొలం వద్దకు తీసుకెళ్లి నాగలి కాడిని ఆ యువతి, యువకుడి భుజాలపై ఉంచి పొలాన్ని దున్నించారు. దున్నుతున్న క్రమంలో ఎద్దులను కొట్టినట్లు వారిపై కర్రలతో దాడి చేశారు. అక్కడితో ఆగకుండా గుడివద్దకు తీసుకువెళ్లి పాపపరిహాం పేరుతో వారిని హింసించారు.
Also Read: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు
కాగా దీన్ని స్థానికులు కొందరు వీడియో తీసి నెట్ లో పెట్టారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొంతమంది ఈ ఘటనను తీవ్రంగా ఖండించగా, మరికొందరు వరుస కాకపోవడం వల్లే వారి పెళ్లికి అంగీకరించలేదని అంటున్నారు. అయినా ఇలా శారీరకంగా శిక్షించడం మాత్రం నేరమని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయి రెడ్డికి బిగ్ షాక్