Vegetables : కూరగాయల ధరలకు రెక్కలు..కిలో టమాటా ఎంతో తెలుసా?
ప్రస్తుతం కూరగాయలన్నీ దాదాపు కిలో 80 రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఉన్నాయి. కేవలం 15 రోజుల వ్యవధిలోనే ఉల్లి, టమాట సహా అన్ని కూరగాయల ధరలు సుమారు 60 శాతం వరకు పెరిగాయి. మొన్నటి వరకు వంద రూపాయలకు ఆరు కిలోలు దొరికిన టమాటా 80 నుంచి వంద రూపాయలు పలుకుతుంది.