BREAKING: జమ్మూ కశ్మీర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూకశ్మీర్‌ బండిపొరా జిల్లాలో LoC వెంట గురువారం ఎన్‌కౌంటర్ జరిగింది. చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ హతమార్చింది. బండిపొరాలోని గురెజ్ సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆపరేషన్ 'నౌషెరా నార్ IV'లో విజయం సాధించామని సైన్యం తెలిపింది.

New Update
terrorists

terrorists

జమ్మూకశ్మీర్‌లోని బండిపొరా జిల్లాలో LoC వెంట గురువారం ఎన్‌కౌంటర్ జరిగింది. చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ హతమార్చింది. బండిపొరాలోని గురెజ్ సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ 'నౌషెరా నార్ IV'లో విజయం సాధించామని సైన్యం తెలిపింది. జమ్మూకశ్మీర్ పోలీసులు ఇచ్చిన నిఘా సమాచారం ఆధారంగా గురెజ్ సెక్టార్‌లో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో, చొరబాటుకు ప్రయత్నిస్తున్న కొంతమంది అనుమానాస్పద వ్యక్తుల కదలికలను సైనికులు గుర్తించారు. వారిని లొంగిపోవాలని సవాలు చేయగా, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీనికి సైనికులు దీటుగా బదులిచ్చారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇంకా కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ 

గురెజ్ సెక్టార్‌లోని ఆ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు దాగి ఉన్నారా అనే అనుమానంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అదనపు బలగాలను రంగంలోకి దింపి ఆపరేషన్‌ను మరింత ముమ్మరం చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడం వల్ల సరిహద్దులో భద్రతా దళాల అప్రమత్తత, సంసిద్ధత మరోసారి రుజువైంది. గతంలో కూడా సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు యత్నాలు జరిగాయి. ఈ నెల ప్రారంభంలో కూడా పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట చొరబాటుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. ఈ ఘటనకు రెండు రోజుల ముందు, పహెల్గాంలో జరిగిన ఉగ్రదాడికి కారణమైన ముగ్గురు ఉగ్రవాదులను శ్రీనగర్ అడవులలో భద్రతా బలగాలు హతమార్చాయి.

Advertisment
తాజా కథనాలు