/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
జమ్ము కశ్మీర్ శ్రీనగర్‌లోని హిర్వాన్ - లిద్వాస్ ప్రాంతంలో కాల్పులు కలకలం రేపాయి. కొన్ని రోజులుగా భద్రతా బలగాలు ఆపరేషన్ మహదేవ్ చేస్తున్నాయి. సోమవారం ఉదయం ఉగ్రవాదులకు, బలగాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. టెర్రరిస్టులు ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తలా మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఒక్కో ఉగ్రవాదిపై రూ.20 లక్షల రివార్డు ప్రటించారు.
BIG
— ARMED FORCES (@ArmedForces_IND) July 28, 2025
3 #Terrorists suspected to be involved in #PahalgamTerrorAttack have been gunned Down by Security forces in Lidwas area of #JammuAndKashmir under Operation Mahadev.#Encounter#IndianArmy#OperationMahadev#OperationSindoor#stockmarketsindia#Nellai#TejRanpic.twitter.com/abFVGp3EG5
శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. వీరు జవాన్ల కాల్పుల్లో చనిపోయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని బైసరన్ లోయలో పహల్గామ్ ప్రాంతంలో పర్యటకులపై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది టూరిస్టులను టెర్రరిస్టులు కాల్చి చంపారు. 10 మంది ఉగ్రవాదులు ఇండియన్ ఆర్మీ యూనిఫాంలో వచ్చి తుపాకులతో పర్యటకులపై విచక్షణారహితంగా ఫైరింగ్ చేశారు. దీనికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రవాద స్థావరాలపై విజయవంగా వైమానిక దాడులు చేసింది.
attack in Pahalgam | breaking news pahalgam | jammu kashmir attack | latest-telugu-news