/rtv/media/media_files/2025/03/25/imMBG2oaayw4N7QxkFpP.jpg)
IBM Company
ఐటీ రంగంలో ఉద్యోగాల తొలగింపు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు ఖర్చులు తగ్గించుకునేందుకు లేఆఫ్స్ చేస్తున్నాయి. తాజాగా మరో ఐటీ దిగ్గజం ఉద్యోగులను తగ్గించేందుకు సిద్ధమవుతోంది. ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ (IBM) కంపెనీ అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న దాదాపు 9 వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. తన క్లౌడ్ క్లాసిక్ వర్క్ ఫోర్స్‌లో నాలుగో వంతు మందిని తీసేయనుంది.
Also Read: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు.. మద్యం మత్తులో యువతిని ఢీ కొట్టి..!
న్యూయార్క్, డల్లాస్, కాలిఫోర్నియా, నార్త్ కరోలినా, రాలిలో పనిచేసే 9 వేల మంది ఐబీఎం ఉద్యోగులపై ఎఫెక్ట్ పడనున్నట్లు తెలుస్తోంది. కన్సల్టింగ్, సేల్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫరింగ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇనిషియేటివ్స్ వంటి ఉద్యోగులే లేఆఫ్‌ల ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం. క్లౌడ్ విభాగంలో 10 శాతం మంది ఉద్యోగులను తొలగించేందుకు ఇప్పటికే సమాచారం అందినట్లు తెలుస్తోంది.
Also Read: పోలీసుస్టేషన్ లోనే భర్త ముఖం పగలకొట్టిన ఇంటర్నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్!
భారత్‌లో పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఐబీఎంకు భారీ కార్యాలయాలు ఉన్నాయి. ఇదిలాఉండగా ఈమధ్య కాలంలో దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇవ్వడం సాధారణ అయిపోయింది. ఇటీవల ప్రముఖ ఇ--- -కామర్స్ సంస్థ అమెజాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2025లో ఆరంభంలోనే దాదాపు 14 వేల మంది మేనేజర్ల ఉద్యోగాలు తొలగించనుంది. దీనివల్ల ఏడాదికి 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలయన్ డాలర్ల వరకు ఆదా చేయాలని టార్గెట్ పెట్టుకుంది. భారత కరెన్సీలో చూస్తే ఇది రూ.31 వేల కోట్లకు పైగానే ఉంది. ఈ తొలగింపుల వల్ల అమెజాన్‌లోని మేనేజ్‌మెంట్ ఉద్యోగుల్లో 13 శాతం తగ్గిపోనుంది.
Also Read: పీఎం కిసాన్ స్కీమ్.. అనర్హుల నుంచి రూ.416 కోట్లు రికవరీ
Also Read: షాకింగ్ ఘటన.. విమానాన్ని ఢీకొట్టి ఇంజిన్ లో పడిన పక్షి.. చివరికి ఏమైందంటే..!?
it-company | layoff | rtv-news