TG Crime: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్ కేసు.. మద్యం మత్తులో యువతిని ఢీ కొట్టి..!

హైదరాబాద్‌ ఐడిపిఎల్ చౌరస్తా దగ్గర ఓ యువతిని ఫార్చునర్ కారు ఢీ కొట్టింది. అనంతరం కారు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు ఫతే నగర్ సిగ్నల్ దగ్గర నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

New Update
Crime news balnagar

Crime news balnagar

TG Crime: హైదరాబాద్‌లో కారు అతి వేగం కారణంగా ఓ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బాల్‌నగర్‌లో కలకలం రేపింది. బాల్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఐడిపిఎల్ చౌరస్తా దగ్గర ఓ యువతిని ఫార్చునర్ కారు ఢీ కొట్టింది. అనంతరం కారు డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంపై వెంటనే ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫతే నగర్ సిగ్నల్ దగ్గర కారు ఆపి పారిపోతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మద్యం మత్తులో.. 

ఇది కూడా చదవండి: యూరిక్ యాసిడ్ పెరిగిందా..టాబ్లెట్స్‌కి బదులు ఇవి తీసుకోండి

కారుతో ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి బల్కంపేటకు చెందిన గొగం అనిల్(35)గా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మార్చి 24 (సోమవారం)న రాత్రి మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో విందుకు హాజరై ఉదయం తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. నిందితుడు అనిల్ మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసుల తనిఖీలో తెలింది. ఘటనపై బాల్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు తెలిపారు.


ఇది కూడా చదవండి: ఈ వ్యక్తులు ఖచ్చితంగా ఆకుపచ్చ క్యాప్సికమ్ తినాలి

Advertisment
తాజా కథనాలు