Sabarimala: ఐదురెట్లు అధిక రద్దీ.. వారికి ప్రత్యేక పాస్‌లు రద్దు

శబరిమల అయ్యప్ప ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్‌ టిక్కెట్లు తీసుకున్న స్వాములతో పంబ నుంచి దర్శనం కోసం వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది.దీంతో పాస్‌లను ఆపేశారు.

New Update
sabarimala

Sabarimala:మండల పూజ అనంతరం మకరు విళక్కు కోసం డిసెంబరు 30న తెరుచుకున్న శబరిమల అయ్యప్పస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అంచనాలకు మించి అటవీ మార్గం ద్వారా ఐదు రెట్లు అధికంగా స్వాములు శబరిమలకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో వనయాత్ర చేసే భక్తులకు కల్పించిన ప్రత్యేక దర్శనం పాస్‌లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు టీడీబీ ప్రకటించింది. 

Also Read: Sunita Williams: ఒకే రోజు 16 సూర్యోదయాలు చూసిన సునీతా విలియమ్స్

ఎరుమేళి నుంచి అటవీ మార్గంలో అలుదానది, కలిడం కుండ్రు, కరిమల మీదుగా(పెద్దపాదం) శబరిమలకు నడక మార్గంలో వచ్చే భక్తులకు ఈ ఏడాది ప్రత్యేక పాస్‌లు సౌకర్యం కల్పించిన సంగతి  తెలిసిందే. కానీ, రద్దీ విపరీతంగా ఉండటంతో వాటిని తాత్కాలికంగా ఆపేశారు.

Also Read: AP:  న్యూ ఇయర్‌ కిక్కు.. వామ్మో ఒక్కరోజులోనే అంత తాగారా?

ఐదు రెట్లు అధికంగా స్వాములు..

‘‘గత నెల 30న ప్రారంభమైన మకరవిళక్కు సీజన్‌కు అంచనాలకు మించి, ఐదు రెట్లు అధికంగా స్వాములు వస్తున్నట్లు సమాచారం. దీంతో పెద్దపాదం మీదుగా వచ్చే అయ్యప్ప మాలధారులకు ఇచ్చే ప్రత్యేక దర్శన పాస్‌ల జారీని తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిలిపివేస్తున్నామని టీడీబీ ఓ ప్రకటనలో ప్రకటించింది.

Also Read:Tirumala: కియోస్క్ మెషిన్‌ ప్రారంభం.. డబ్బులు లేకపోయినా పర్లేదు

వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్‌ టిక్కెట్లు తీసుకున్న భక్తులతో పాటు వనయాత్రలో ప్రత్యేక పాస్‌లు పొందుతున్న స్వాములతో పంబ నుంచి క్యూలైన్‌లో దర్శనం కోసం వేచి ఉండే పరిస్థితి ఏర్పడిందని, అందుకే పాస్‌లను ఆపేస్తున్నట్లు టీడీబీ సభ్యుడు ఏ అజికుమార్ ప్రకటించారు.

Also Read: Gunturu: బాపట్ల లో దారుణం..నడి రోడ్డు పై భర్తను ఉరేసి చంపిన భార్య!

అటవీ మార్గంలో శబరిమలకు వచ్చేవారికి రోజుకు 5 వేల చొప్పున ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తున్నారు అధికారులు. కానీ, పెద్దపాదం మీదుగా వచ్చే భక్తులు టీడీబీ అంచనాలకు మించి ఐదు రెట్లు అధికంగా తరలి వస్తున్నారు. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ప్రత్యేక పాస్‌లను నిలిపివేస్తూ అధికారులు ఓ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏరుమేళి.. అలుదా నది.. కరిమల శిఖరం మీదుగా వచ్చే స్వాములకు అటవీ శాఖ ట్యాగ్‌లు జారీచేయడంతో పాటు ప్రత్యేకంగా కేటాయించిన క్యూలైన్‌ ద్వారా దర్శనాలు చేసుకునే వీలు కల్పించింది. 

 జనవరి 14న శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఉంటుందిఇక, జనవరి 15 వరకు వర్చువల్ క్యూ టిక్కెట్లు అన్నీ బుక్ అయిపోయినట్లు అధికారులు తెలిపారు.. స్పాట్ బుకింగ్ మాత్రమే అందుబాటులో ఉన్నట్టు టీడీబీ అధికారులు వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు