Tirumala: తిరుమలలో దేవస్థానం వారు నిర్వహిస్తున్న ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు విరాళం ఇచ్చేందుకు మరో వినూత్న ఏర్పాటు చేశారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్ మెషిన్‌ను టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి నూతన సంవత్సరం మొదటి రోజున ప్రారంభించారు. ఈ మెషిన్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టీటీడీకి విరాళంగా అందించినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఎయిర్ ఇండియా..
క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి..
ఈ మెషిన్ల ద్వారా భక్తులు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు తమకు తోచిన మొత్తాన్ని కియోస్క్ మిషన్ లోని క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి యూపీఐ ద్వారా సులభతరంగా విరాళంగా అందజేయోచ్చు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి రీజనల్ హెడ్ జీ రామ్ ప్రసాద్, ఐటీ డీజీఎం బి వెంకటేశ్వర నాయుడు, డిప్యూటీ రీజనల్ హెడ్ వీ బ్రహ్మయ్య, ఇతర అధికారులు బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: Time Travel Flight: రియల్ లైఫ్ టైమ్ ట్రావెలర్.. 2025 నుంచి 2024కు వెళ్లిన విమానం!
జనవరి 10వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలోని శ్రీ సౌమ్యనాథస్వామిఆలయంలో జనవరి 10న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Also Read: RJ:బోర్‌వెల్‌లో పది రోజులు ఉన్న పాప..రెస్క్యూ చేసిన తర్వాత మృతి
ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం కల్పించడంతో పాటు.. ఉదయం 8.30 గంటలకు లక్ష తులసీ అర్చన చేయనున్నట్లు సమాచారం. జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 8.45 గంటలకు గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.