BIG BREAKING: తమిళనాడు మంత్రుల ఇంట్లో బాంబు?

తమిళనాడు మంత్రులు కె.ఎన్. నెహ్రూ, అన్బిల్ మహేష్ పొయ్యమోళి నివాసాలలో బాంబులు పెట్టినట్లు పోలీసులకు ఉదయం ఒక బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. దీంతో తిల్లై నగర్, అన్నా నగర్‌లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా ఏమీ లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

New Update
bomb threats

bomb threats

తమిళనాడు మంత్రులు కె.ఎన్. నెహ్రూ, అన్బిల్ మహేష్ పొయ్యమోళి నివాసాలలో బాంబులు పెట్టినట్లు బెదిరిస్తూ సిటీ పోలీసులకు ఉదయం ఒక ఇమెయిల్ వచ్చింది. దీంతో తిల్లై నగర్, అన్నా నగర్‌లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో వంట గది నుంచి అన్ని ప్రాంతాలను కూడా అధికారులు తనిఖీలు చేశారు. చివరకు వాహనాలు కూడా తనిఖీలు చేయగా.. ఎలాంటి అనుమానస్పద వస్తువులు కనిపంచలేదు. దీంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ బెదిరింపుల సమయంలో ఇద్దరు మంత్రులు కూడా లేరు. 

ఇది కూడా చూడండి: Indian Railways: రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త.. ఆ రైళ్లలో ఇక స్నానానికి వేడి నీళ్లు!

ఇది కూడా చూడండి: Delhi Red Fort Blast : ఢిల్లీ పేలుళ్ల ఘటనలో కీలక వీడియో.. 15 సెకన్ల లలో

Advertisment
తాజా కథనాలు