Delhi Red Fort Blast : ఢిల్లీ పేలుళ్ల ఘటనలో కీలక వీడియో.. 15 సెకన్ల లలో

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తాజాగా విడుదలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన 15 సెకన్ల క్లిప్‌లో పేలుడు సంభవించడానికి కొద్ది క్షణాల ముందు పరిస్థితి అంతా సాధారణంగా ఉంది.

New Update
blast

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తాజాగా విడుదలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన 15 సెకన్ల క్లిప్‌లో పేలుడు సంభవించడానికి కొద్ది క్షణాల ముందు పరిస్థితి అంతా సాధారణంగా ఉంది.పేలుడు జరిగిన ప్రాంతంలో ఆ సమయంలో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. ఎర్రకోట సమీపంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తోంది. 

ఒక్కసారిగా భారీ పేలుడు

సాధారణ ప్రయాణికులు, వాహనాలు రోడ్డుపై ముందుకు సాగుతున్నాయి. సాయంత్రం 6.50 గంటలకు ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో దట్టమైన పొగతో కూడిన విస్ఫోటనం జరిగింది. ఈ పేలుడు ధాటికి సమీపంలోని భవనాలు, వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు, ప్రజలు భయంతో పరుగులు తీసినట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. పేలుడు జరిగిన వెంటనే ఆ ప్రాంతమంతా దుమ్ము, ధూళితో నిండిపోయింది. 

పేలుడు జరిగిన ప్రదేశం నుండి పొగ కమ్ముకోవడంతో పాటు క్షణాల్లో భయానక వాతావరణం నెలకొంది.పేలుడు జరిగిన ప్రదేశాన్ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు, ఫోరెన్సిక్ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎర్రకోట వంటి అత్యంత సున్నితమైన ప్రాంతం సమీపంలో ఈ ఘటన జరగడంపై భద్రతా లోపాలపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పేలుడు సమయంలో కారులో ఉన్న వ్యక్తిని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబిగా గుర్తించారు. ఇతను ఫరీదాబాద్‌లోని ఆల్-ఫలా యూనివర్సిటీలో టీచింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఉగ్రకుట్రలో జైషే మహమ్మద్‌ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు